Srisailam: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది.. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ ఎగరడం సంచలనంగా మారింది.. ఆలయ పరిసరాలపై అర్ధరాత్రి సమయంలో మరోసారి డ్రోన్ ఎగడరంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అర్ధరాత్రి సమయంలో ఆలయం పరిసరాల్లో డ్రోన్ ఎవరు ఎగరవేశారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు దేవస్థానం అధికారులు.. ఈ వ్యవహారంపై సెక్యూరిటీ ఆఫీసర్ ఆరా తీస్తున్నారు.. అయితే, శ్రీశైలం ఆలయం పరిధిలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా డ్రోన్ కెమెరాలు ఎగురవేయడంపై నిషేధం ఉంది.. అది కూడా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ ఎగడరంతో.. ఇది ఎవరిపని? అనేది ఇప్పుడు చర్చగా మారింది.. ఆకతాయిల చర్యనా..? ఇంకా ఎవరైనా ఆలయ పరిసరాలను చిత్రీకరించడమే పనిగా పెట్టుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. ఆలయ సమీపంలోని ఆకాశాంలో గోపురాల చుట్టూ డ్రోన్ చక్కర్లు కొట్టడం పలు అనుమానాలు తావిస్తోంది.. గుప్త నిధులకోసం ఎవరైనా ఈ పని చేశారా? ఇంకా ఏదైనా ఉందా అనే కోణంలో స్థానికులు, భక్తుల్లో కలరం మొదలైంది.. మరోవైపు శ్రీశైలం క్షేత్ర పరిధిలో డ్రోన్ ఎగిరే దృశ్యాలు ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..
Read Also: Maoist Chief India: మావోయిస్ట్ సెంట్రల్ చీఫ్ కుర్చీపై తెలంగాణ వ్యక్తి..