Gymkhana Stadium: జింఖానా మైదానంలో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. HCA ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సహా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మధ్యాహ్నం 3 గంటలకు తన కార్యాలయానికి రావాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. టికెట్ల విక్రయాలపై పూర్తి సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు HCAకు నోటీసులిచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. జింఖానా గ్రౌండ్ లో టికెట్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయని HCAపై చర్యలకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు.…
Santosh Kumar: ఆసియాలోనే రెండో అతిపెద్ద మర్రిచెట్టు తెలంగాణలోనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో ఈ వృక్షం నెలకొని ఉంది. 800 ఏళ్ల నాటి ఈ పురాతన వృక్షాన్ని సంరక్షించేందుకు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ నడుం బిగించారు. ఇప్పటికే ఆయన పర్యావరణ పరిరక్షణకు ఎంతో పాటుపడుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీల చేత మొక్కలు నాటిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎన్నో లక్షల మొక్కలను నాటారు. తాజాగా మహబూబ్‌నగర్…
మహబూబ్‌నగర్ ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గాల్లోకి కాల్పులు జరపటం పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీతో తాను కాల్పులు జరపడాన్ని విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తాను పేల్చింది రబ్బర్ బుల్లెట్ అని స్పష్టంగా…
త్వరలోనే హైదరాబాద్ లోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ.. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు.…