ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం విషయంలో రోజురోజుకీ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.. ఏపీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ మంత్రులు.. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కొత్త వాదన సరికాదన్న ఆయన.. నీటి వాటాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోండి అనడంలో ఆంతర్యం చెప్పాలి? ఏపీ…
ఏపీ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పాదనను అడ్డుకునేలా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం దారుణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం హైడెల్ పవర్ ప్రాజెక్టేనని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం హైడెల్ పవర్ పై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారిందని… కృష్ణా బోర్డు అనేక అంశాల్లో చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ట్రిబ్యునల్…
హైదరాబాద్ లో గచ్చిబౌలి లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ ని సందర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జులై 23 – 2021 నుండి ఆగస్టు 8 – 2021 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలంపిక్స్ కు సన్నద్ధమవుతున్నా బ్యాడ్మింటన్ క్రీడాకారులను కోచ్ గోపిచంద్తో కలసి మంత్రి ప్రోత్సహించారు. లాక్ డౌన్ సమయంలో క్రీడాకారులు బయటికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మంత్రి. కోవిడ్ నిర్ములన లో భాగంగా క్రీడాకారులు తమ ఫిట్ నెస్ ను…