Srinivas Goud: రబ్బర్ బుల్లెట్ పేల్చితే రాజీనామా చేయాలా? విడ్డూరంగా ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్‌నగర్ ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గాల్లోకి కాల్పులు జరపటం పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీతో తాను కాల్పులు జరపడాన్ని విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తాను పేల్చింది రబ్బర్ బుల్లెట్ అని స్పష్టంగా చెప్పినప్పటికీ విపక్షాలు కక్కుర్తి రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తనను రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లో ఏ చట్ట ప్రకారం తుపాకి తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఏమైనా లైసెన్స్ ఉందా అని రఘునందన్‌రావు నిన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడేందుకు డీజీపీ ఆఫీసుకు ఎప్పుడు రమ్మంటారని, మంత్రి పేల్చిన తుపాకిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని అన్నారు. లేకుంటే.. రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రఘునందన్‌రావు కోరారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
భారతీయ శిక్షా స్మృతి, రాజ్యాగం ప్రకారం ఈ చట్టాలలో ఎక్కడ అన్న ఎస్పీకి ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమని చెప్పే చట్టముందా అంటూ ప్రశ్నించారు. తను ఒక బాధ్యత గల మంత్రి, తన గన్‌మెన్ దగ్గర నుంచి తీసుకున్నారు. కానీ.. దాని కప్పి పుచ్చుకోవాడానికి ఎస్పీ నేనే ఆ తుపాకీ ఇచ్చాను అని చెప్పారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఎస్పీపై చర్యలు తీసుకోవాలని, శ్రీనివాస్ గౌడ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్డ్ అయ్యాక వచ్చే సలహాదారు పోస్టు కోసమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.
Kashmir: 30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్లు
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!