SRINAGAR: భారతదేశంలోని మొట్టమొదటి తపాలా కార్యాలయం, ఇటీవలి వరకు, చివరి తపాలా కార్యాలయంగా పిలువబడింది. జమ్మూ, కాశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో కిషెన్‌గంగా నది ఒడ్డున ఉంది.. పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్ 193224 ను కలిగి ఉంది, ఇది పోస్ట్ మాస్టర్ మరియు ముగ్గురు మెయిల్ రన్నర్‌లచే నిర్వహించబడుతుంది. ఇది ఇటీవలి వరకు దేశంలోని చివరి పోస్టాఫీసుగా పిలువబడింది. ఇప్పుడు దానికి సమీపంలో ఉన్న సైన్‌బోర్డ్ దీనిని భారతదేశంలోని మొదటి తపాలా…
ఉత్తరాఖండ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో చార్ ధామ్ టూర్ లో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ చరియలు విరిగిపడటంతో నిన్నటి నుంచి రోడ్లపైనే యాత్రికులు ఉంటున్నారు.
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జమ్మూ, కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
Jammu & Kashmir: కాశ్మీర్‌లో విచిత్రమైన ఉదంతం తెరపైకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా 32మందిని పెళ్లి చేసుకుంది. విశేషమేంటంటే వారందరినీ చట్టబద్ధంగా చేసుకుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలు పెట్టింది. వారందరినీ మోసం చేసి పరారైంది. ఇప్పటి వరకు ఆమె అసలు పేరు, గుర్తింపు, చిరునామా గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.
కతువాలోని బకర్వాల్ కమ్యూనిటీకి చెందిన 8 ఏళ్ల బాలిక 10 జనవరి 2018న తప్పిపోయింది. వారం తర్వాత ఆ బాలిక అడవిలో శవమై కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ బాలిక కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులో ఈరోజు(శనివారం) తిరిగి ప్రారంభించారు. గత ఏడాది నవంబర్‌లో, శుభమ్ సంగ్రాను జువైనల్‌గా కాకుండా పెద్దవాడుగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Mehbooba Mufti: జీ 20 దేశానికి సంబంధించిన కార్యక్రమం అని.. కానీ బీజేపీ దాన్ని హైజాక్ చేసిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ బెంగళూర్ లో ఆరోపించారు. జీ 20ని వ్యతిరేకించడం లేదని, కానీ బీజేపీ హైజాక్ చేసిందని అన్నారు. చివరకు జీ 20 లోగోను కూడా కమలంగా మార్చిందని ఆమె విమర్శించారు. లోగో దేశానికి చెందినదిగా ఉండాలని, పార్టీకి సంబంధించిన విధంగా ఉండకూడదని ఆమె అన్నారు.
G20: జమ్మూ కాశ్మీర్ లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్(టీడబ్ల్యూజీ) సమావేశం మే 23,24,25 తేదీల్లో జరగనుంది. శ్రీనగర్ లో ఈ సమావేశం జరుగబోతోంది. అయితే ప్రస్తుతం ఇదే పాకిస్తాన్ కడుపు మంటకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ గూఢాచర సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాదులతో కలిసి కుట్ర పన్నుతోంది.
జమ్ము కశ్మీర్ లో రంగురంగు విరులు పర్యాటకులను కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ ను అధికారులు మార్చ్ 19న తెరిచారు. దీంతో రంగురంగుల పూలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు. 30 రోజుల్లో రికార్డు స్థాయిలో 3.75 లక్షల మంది తులిప్ గార్డెన్ ను సందర్శించారు.
శ్రీనగర్‌లోని ప్రఖ్యాత తులిప్ గార్డెన్ పర్యాటకుల సంఖ్యలో కొత్త రికార్డును నెలకొల్పింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఖ్యాతి అర్జెంటీనా వంటి సుదూర దేశాలకు చేరుకుంది.
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తి కాగా.. శ్రీనగర్‌లో సోమవారం కాంగ్రెస్ ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది.