ఈ ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం దాల్ సరస్సు సమీపంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ మంగళవారం వెల్లడించారు.
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో శుక్రవారం రాత్రి మూడేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసింది. చిన్నారిని ఎత్తుకుని ఇంటికి దూరంగా ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి అదృశ్యమైంది.
తాజాగా జమ్మూకశ్మీర్‌లో ఓ పెళ్లి కొడుకు ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మరికొద్ది నిమిషాలలో అతను వివాహం చేసుకున్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చాడు. అప్పటికే ముస్తాబాయి పెళ్లి కొడుకు శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని గందర్ బల్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. Also Read: Revanth Reddy: ఓటు వేద్దాం.. ఈ దేశపు తలరాతను మారుద్దాం: రేవంత్ రెడ్డి అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయడం ప్రతి పౌరుడి విధి…
Boat Accident in Srinagar’s Jhelum River: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం శ్రీనగర్ సమీపంలోని జీలం నదిలో పాఠశాల పిల్లలు మరియు స్థానికులను తీసుకెళుతున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 12 మంది పిల్లలు రక్షించబడ్డారు. ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. Also Read: Lok Sabha Elections 2024: 45 రోజులు.. రూ.4,650…
జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ ఇవాళ(మార్చి 23) పర్యాటకుల కోసం తెరుచుకుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో స్థానికేతర కార్మికుడు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని పంజాబ్ అమృత్‌సర్‌కి చెందిన అమృత్ పాల్ సింగ్‌గా గుర్తించారు. క్షతగాత్రుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన శ్రీనగర్ పట్టణంలోని షహీద్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా…
Dal lake: ప్రముఖ పర్యాటక ప్రాంతం శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. సరస్సులోని బోట్‌హౌజులను అగ్ని చుట్టుముట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మరణించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా బంగ్లాదేశ్‌కి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 5 హౌజ్ బోట్లు ధ్వంసమయ్యాయి.
శ్రీనగర్ లోని ఈద్గా సమీపంలో ఉగ్రవాదులు ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్‌పై కాల్పులు జరిపి గాయపరిచారు. అతన్ని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాము అని కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్(ట్విట్టర్)లో తెలిపారు. ప్రస్తుతం పోలీస్ అధికారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.