Kathua Case: కతువాలోని బకర్వాల్ కమ్యూనిటీకి చెందిన 8 ఏళ్ల బాలిక 10 జనవరి 2018న తప్పిపోయింది. వారం తర్వాత ఆ బాలిక అడవిలో శవమై కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ బాలిక కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులో ఈరోజు(శనివారం) తిరిగి ప్రారంభించారు. గత ఏడాది నవంబర్‌లో, శుభమ్ సంగ్రాను జువైనల్‌గా కాకుండా పెద్దవాడుగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కథువా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మరియు జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. జమ్మూలోని మెడికల్ బోర్డు మార్చి 2018లో అతనిని పెద్దవాడిగా ప్రకటించినప్పటికీ.., నాలుగు సంవత్సరాల పాటు తన వయస్సుపై కౌంటర్-క్లెయిమ్‌లను వేసుకొని విచారణ నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు కోర్టుకు వేసవి సెలవుల కారణంగా ఈరోజు ఈ కేసులో పెద్దగా పురోగతి లేదని, జూలైలో తదుపరి విచారణకు లిస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ తెలిపింది.
Read Also: Mint Leaves Benfits: పుదీనా ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యతో బాధపడుతున్న వారు తప్పక తీసుకోవాలి!
నేరం జరిగినప్పుడు సంగ్రా పెద్దవాడని వైద్య ఆధారాలు రుజువు చేశాయని, మరే ఇతర రుజువు లేనప్పుడు వైద్య అభిప్రాయాన్ని నిశ్చయాత్మకమైన సాక్ష్యంగా పరిగణిస్తామని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని క్రైమ్ బ్రాంచ్ పరిశోధనల ప్రకారం, సంగ్రా బాలికను అత్యాచారం మరియు హత్య చేసిన సమయంలో “అత్యంత క్రూరంగా” ఉండేవాడని తెలిపింది. మరోవైపు 2018 జనవరిలో జరిగిన ఈ నేరంలో ప్రమేయం ఉన్న మరో ఏడుగురు నిందితులు ఇప్పటికే దోషులుగా నిర్ధారించబడ్డారు. అయితే ప్రధాన నిందితుడిపై విచారణ సందర్భంగా ఎలాంటి జడ్జిమెంట్ రానుందోనని అక్కడి ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.