Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తి కాగా.. శ్రీనగర్‌లో సోమవారం కాంగ్రెస్ ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ముగింపు సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా.. సోమవారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి మంచు కురుస్తుండడంతో.. ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూసి రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోదరి ప్రియాంక గాందీతో మంచులో ఆటలాడుకున్నారు. ఒకరిపై ఒకరు మంచు గడ్డలు విసురుకున్నారు. వీరిద్దరూ సరదాగా కుస్తీలు పడుతూ ఒకరిపై ఒకరు మంచు విసురుకుంటున్న వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు.
All Party Meeting: పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ
ఆ వీడియోలో రాహుల్ తన చేతుల్లోని స్నో బాల్స్‌ను తన వెనుక దాచుకుని తన సోదరిపైకి విసరడం కనిపించింది.చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుతూ ప్రియాంక తలపై పిడికిలిలోని మంచును విసిరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా రాహుల్ మంచు విసిరి ఆహ్లాదంగా, సంతోషంగా గడిపారు. రాహుల్, ప్రియాంక మళ్లీ చిన్న పిల్లల్లా మారిపోవడం చూసి కార్యకర్తలు మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని పాదయాత్ర ఆదివారం శ్రీనగర్‌లో జరగనున్న మెగా ర్యాలీతో ముగిసింది.
Sheen Mubarak!😊
A beautiful last morning at the #BharatJodoYatra campsite, in Srinagar.❤️ ❄️ pic.twitter.com/rRKe0iWZJ9
— Rahul Gandhi (@RahulGandhi) January 30, 2023