జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. రాజధాని శ్రీనగర్ శివారులోని పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. గామపడిని పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా గాలింపుచర్యలు చేపట్టారు. Read: వైరల్:…
శ్రీనగర్‌లోని బెమీనాలో గల స్కిమ్స్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. అనంతరం ఉగ్రవాదులు భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఆసుపత్రిలోని సిబ్బందిని, పౌరులను అడ్డుపెట్టుకొని తప్పించుకున్నట్లు శ్రీనగర్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శ్రీనగర్ పోలీసులు, భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇండియా పాక్ మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్‌లో రెచ్చిపోతున్నారు. విధ్వంసాలు సృష్టిస్తున్నారు. పుల్వామా ఘటన తరువాత రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. గతంలో ఇండియా రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇండియా విమానాలు ఇతర దేశాల మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు కాశ్మీర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాలకు కూడా పాక్ అనుమతులు ఇవ్వలేదు. Read: వైరల్:…