శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు… ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారామె.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి… ఓ హోటల్ నడుపుతోన్న మహిళ దగ్గరకు వెళ్లిన సీఐ అంజూ యాదవ్… ఆమె భర్త ఆచూకీ ఎక్కడని అడిగింది.. అయిత, ఆమె తెలియదని సమాధానం ఇవ్వడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఐ.. మహిళపై దాడి చేసింది.. నడి రోడ్డుపై మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు.. చీర ఊడిపోయేలా కొట్టి, బలవంతంగా…
ఆడ, మగ మధ్యే కాదు.. ఇద్దరు మహిళల మధ్య కూడా ప్రేమలు ఉంటాయి.. కానీ, ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకునే ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి.. సమాజం ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకుంటూ అంగీకరించదు.. అయితే, కడప జిల్లాలో ఓ ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఓ యువకుడితో పెళ్లి జరిగిన తర్వాత.. వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. విడిపోయారు.. ఈ నేపథ్యంలో.. మరో యువతితో స్నేహం.. ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది…
శ్రీకాళహస్తిలోని పిన్ కేర్ అనే ప్రైవేట్ బ్యాంక్‌లో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బ్యాంకు మేనేజర్ ఆడిటింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు బ్యాంకులోకి వెళ్లి మహిళా ఉద్యోగులను బెదిరించి వాళ్లను బంధించారు. అనంతరం వాళ్ల దగ్గర లాకర్ రూమ్ తాళాలు తీసుకుని రూ.85 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.…
శ్రీకాళహస్తీ ఆలయ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాహు కేతు పూజలలో భక్తులకు త్వరలో బంగారు నాగపడగలు వినియోగానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు వెండి నాగపడగలతో తమ దోషాలను తొలగించుకున్న భక్తులు..ఇకపై బంగారు పడగలతో సేవలను పొందనున్నారు. వాయులింగ క్షేత్రం గా…. రాహు కేతువులకు నిలయంగా విరాజిల్లుతున్న ముక్కంటి క్షేత్రం శ్రీకాళహస్తి. రాహు కేతువుల, నాగ దోషాలు, కుజదోషాల నివారణకు పేరుగాంచింది శ్రీకాళహస్తి దేవస్థానం. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు రాహు కేతువుల నిలయంగా పేరుగాంచారు. ఇక్కడి…
బాలాజీ జిల్లా శ్రీకాళహస్తి శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. నాయుడుపేట-పూతలపట్టు రహదారిపై లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరికి చెందిన 12 మంది ఆటోలో నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరిగివస్తుండగా శ్రీకాళహస్తి సమీపంలోని అర్ధనారీశ్వరాలయం సమీపంలో లారీ ఢీకొట్టింది. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణంగా లారీ డ్రైవర్…
కట్టుకున్న భార్యకు అన్నీ తానై చూసుకోవాల్సిన భర్త సైకో ప్రవర్తనతో.. ఓ ఇల్లాలికి నరకం చూపించాడు.. పెళ్లి జరిగినప్పటి నుంచి వికృత వేధింపులకు పాల్పడ్డాడు.. మౌనంగా దాదాపు రెండేళ్లు ఆ సైకోగాడిని భరించిన ఆమె.. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన పోలయ్య 2020 మార్చి 5వ తేదీన వివాహం చేసుకున్నాడు.. ఇక, కొంతకాలం నుంచి తీవ్ర వేధింపులకు దిగాడు.. ఓ వైపు అనుమానం, వికృత వేధింపులు.…
టీడీపీ నేత నారా లోకేష్ రేపు విశాఖ వెళ్లనున్నారు. విశాఖ కోర్టులో ఓ పరువు నష్టం కేసుకి హాజరుకానున్నారు లోకేష్. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక పై లోకేష్ రూ. 75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు లోకేష్. 2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని పత్రికలో కథనం ప్రచురించింది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసిన సంచలనమే.. ఏమి మాట్లాడినా వివాదాస్పదమే.. అందరు చేసే పనిని ఆమె చేయదు. సాధారణంగా కొత్త సంవత్సరం స్టార్ లందరు కుటుంబాలతో కలిసి పార్టీలు చేసుకుంటారు.. గోవా, మాల్దీవులు అంటూ ట్రిప్ లకు వెళ్తారు. ఇప్పటికి పలువురు తారలు అదే పని చేస్తూ కనిపించరు కూడా… అయితే వారిలా నేనెందుకు చేయాలి అనుకున్నదో ఏమో కంగనా నేడు రాహు కేతు పూజలో పాల్గొని దైవ భక్తిలో మునిగిపోయింది. నేడు…
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో గురువారం ఉదయం కేదారేశ్వర గౌరీ వ్రతం ఏకాంతంగా నిర్వహించారు. ఆలయమంతా విద్యుద్దీపాలతో అరటి చెట్లు, మావిడాకులతో సుందరంగా అలంకరించి గౌరీ దేవి అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఎదురుగా కొలువుదీర్చారు. వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో అమ్మవారిని చక్కగా అలంకరించారు. అనంతరం కలశ స్థాపన పుణ్య వచనము ,వరుణ పూజ, కలశానికి పుష్పాలతో కుంకుమతో పూజ చేసి హారతి సమర్పించారు. ఆపై వేద పండితులు గౌరీ వ్రతం గురించి వివరించారు.దీప…