బాలాజీ జిల్లా శ్రీకాళహస్తి శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. నాయుడుపేట-పూతలపట్టు రహదారిపై లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరికి చెందిన 12 మంది ఆటోలో నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరిగివస్తుండగా శ్రీకాళహస్తి సమీపంలోని అర్ధనారీశ్వరాలయం సమీపంలో లారీ ఢీకొట్టింది.
అయితే ఈ ఘటనకు ప్రధాన కారణంగా లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు అర్జునయ్య, నరసమ్మ, కావ్య, మారెమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని తొలుత శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించామని.. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Vijayawada: లాడ్జీలో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించిన పోలీసులు