ఆడ, మగ మధ్యే కాదు.. ఇద్దరు మహిళల మధ్య కూడా ప్రేమలు ఉంటాయి.. కానీ, ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకునే ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి.. సమాజం ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకుంటూ అంగీకరించదు.. అయితే, కడప జిల్లాలో ఓ ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఓ యువకుడితో పెళ్లి జరిగిన తర్వాత.. వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. విడిపోయారు.. ఈ నేపథ్యంలో.. మరో యువతితో స్నేహం.. ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది వ్యవహారం..
Read Also: Nara Lokesh: లోకేష్ కీలక సూచనలు.. అధ్యయనానికి టీడీపీ కమిటీ..
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కమలాపురం నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు.. పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట వివాహమైంది. వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి.. దీంతో.. దూరంగా ఉంటున్నారు.. ఇదే సమయంలో.. సదరు మహిళలకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా.. ప్రేమకు దారి తీసింది.. అది ఎంత వరకు వెళ్లిందంటే.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతవరకు వెళ్లింది.. దీంతో ఇద్దరు మహిళలలు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వెళ్లి.. శనివారం రోజు పెళ్లి చేసుకున్నారు.. ఓ మూడు రోజుల తర్వాత అంటే మంగళవారం తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు.. వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. ఇద్దరు యువతులే కావడంతో షాక్ తిన్న పోలీసులు.. ఆ తర్వాత ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, వారి బంధువులను పిలిపించి.. ఇళ్లకు పంపించారు.