మూడు ప్రముఖ ఆలయాల ఛైర్మన్ గిరి పట్టేశారు. కానీ.. ఆనందం ఆవిరైంది. స్థానిక నినాదం వాళ్లను ఆ పదవులు చేపట్టకుండా చేసింది. స్థానికేతర నినాదం కాస్త గట్టిగానే తాకడంతో హైకమాండ్ కూడా పునరాలోచనలో పడింది. టోటల్‌గా పదవులు వచ్చి.. పదవులు చేపట్టని వారిగా ఆ ముగ్గురూ మిగిలిపోయారు. ఆలయాల పదవులపై స్థానిక నేతల గుర్రు! చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కాక రేపుతూనే ఉంది. జిల్లాలో ముగ్గురు వైసీపీ నేతలు శ్రీకాళహస్తి, కాణిపాకం సహా కర్నూలు…
సమంత అక్కినేని తిరుమలను సందర్శించారు. మొదటి రోజు అక్కడ శ్రీవారిని దర్శించుకున్న సామ్ రెండవ రోజు శ్రీకాళహస్తి ఆలయంలో పూజల్లో పాల్గొంది. నిన్న మధ్యాహ్నం నుండి శ్రీకాళహస్తి దేవ స్థానంలో సమంత వరుస పూజలు నిర్వహిస్తోంది. నిన్న మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసిన సమంత నర దోషం, గ్రహ దోషం, శత్రు శేషం, దాంపత్య సమస్యలు, ఎదుగుదల, నర దిష్టి రుద్ర హోమం, చండి హోమం కూడా చేస్తోంది. ముఖ్యంగా దాంపత్య సమస్య పరిష్కారం కోసం సమంత…
ఆ ఎమ్మెల్యే అమరావతి టూర్ సక్సెస్ అయిందా? నామినేటెడ్ పోస్ట్ వ్యవహారంలో ఇబ్బంది పడి.. ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? పార్టీ పెద్దలతో మాట్లాడి పంతం నెగ్గించుకున్నారా? పదవి పొందిన నాయకుడి ప్రమాణ స్వీకారం ఆగిందా… ఆపారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఎవరికీ టచ్‌లోకి రానని ప్రకటించిన ఎమ్మెల్యే! చిత్తూరు జిల్లాలో కొన్ని నామినేటేడ్ పదవులు స్థానికేతరులకు ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల ట్రస్ట్ బోర్డ్ పదవుల భర్తీ..…
తిరుపతిలోని శ్రీకాళహస్తి పట్టణ శివారులో ‘జగనన్న నవరత్నాలు గుడి’ పేరిట ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓ ఆలయ నిర్మాణం చేశారు. సీఎం జగన్ చేపట్టిన నవరత్నాల గురించి వివరిస్తూ వినూత్న రీతిలో ఎమ్మెల్యే ఈ గుడి నిర్మాణం చేపట్టారు. జగనన్న ఇళ్లు పథకం కింద రెండు వేల మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించిన స్థలంలోనే ఎమ్మెల్యే గుడి నిర్మించారు. రేపు జిల్లా మంత్రుల చేతుల మీదుగా నవరత్నాల గుడి ప్రారంభోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్…
శ్రీకాళహస్తి పరిధిలో వెయ్యి పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రికి జిల్లా యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి, ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద పదిఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు కానుంది తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి. వెయ్యిమంది రోగులకు ఆక్సిజన్ పడకలతో వైద్యం అందించేలా జర్మన్ షెడ్ల ఏర్పాటుకు సమాలోచనలు చేస్తున్నారు అధికారులు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థను గుర్తించిన తూర్పు నావికాదళం… శ్రీకాళహస్తి పైప్స్ సంస్థలోని ప్రాక్స్ ఎయిర్ ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థను…