Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్, ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి ప్రత్యేకమైన గౌరవం, అధికారాలు ఉంటాయని గుర్తు చేశారు. “ఒక సభ్యుడు స్పీకర్‌పై ఇంత…
సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఇతర ఉన్నతాధికారులతో విద్యా సంస్కరణలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు ఎందు వల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని మంత్రి పేర్కొన్నారు.
Sridhar Babu: కరీంనగర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ నియామక ప్రక్రియ వంటి కీలక అంశాలపై స్పందించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటి? అంటూ ప్రశ్నించిన మంత్రి, త్వరలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. బీజేపీ నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ…
Ponnam Prabhakar : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు… మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు మతోన్మాదులు అంటూ ఆయన ఆగ్రహం…
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయని, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి మంత్రి ధన్యవాదాలు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల సీఎం…
CtrlS AI Data Center: తెలంగాణలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ఎస్ (CtrlS) డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా కుదిరింది. ఈ ప్రాజెక్టుకు కంట్రోల్ఎస్ సంస్థ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను తెలంగాణలో నెలకొల్పే ప్రణాళికను రూపొందించింది.…
మంత్రి శ్రీధర్ బాబుకు మరో కీలక బాధ్యత వరించింది. ‘తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మార్చాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ చర్చలో ఇటీవల జరిగిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేచింది. విపక్షపార్టీ ఎమ్మెల్యే వివేక్ చేసిన వ్యాఖ్యలపై రవాణా, పౌరసరఫరాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. “వివేక్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి” అని తెలిపారు. వివేక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదని, ఆయన 2014లోనే అసెంబ్లీకి వచ్చి ఇంకా అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. వివేక్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.…
MLC Kavitha: బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ మీడియా పాయింట్లో చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ, “మేము మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని, నిన్న రాత్రి జరిగిన మూసీ ప్రాజెక్టు విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ, సెప్టెంబర్ 2024లో…