కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డిని ప్రకటించినప్పుడు తాము తీసుకున్న నిర్ణయాలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు (Podcast With NTV Telugu)లో ఆయన ప్రభుత్వ విధానాలను వివరించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. మంత్రి వివరణ ఆయన మాటల్లోనే.. రాబోయే కాలంలో క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించిన అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుని రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి రావడానికి…
ఓట్లు అన్నీ నీకు వేస్తే.. నీళ్ళు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా.. తెలంగాణలో ఆయనకట్టు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నల్గొండకు కోతలు... రంగారెడ్డి కి నీళ్ళు ఇవ్వలేదన్నారు.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకుపోతే తప్పులేదు అన్నారని చెప్పారు. పొద్దున్న క్లబ్.. రాత్రి ఐతే పబ్బుల్లో చర్చ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ రెండు రోజుల పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ప్రస్తుతం టోనీ…
తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చూపించే ప్రభుత్వం అని ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేయొద్దని, తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి శైవ గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుందని తెలిపారు. 18 నెలల్లో 3 లక్షల…
ముఖ్యమంత్రి ముక్కు సూటి మనిషి అని.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మీడియాతో మంత్రి చీట్‌చాట్ నిర్వహించారు. బీజేపీ వాళ్లు దిగి పోండి అంటున్నారు.. బీజేపీ కేంద్రం లో పాలన చేతకాకపోతే దిగమను.పెహల్గం వైఫల్యంకి దిగి పో అనాలా..? బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా..? మోడీ విదేశాలకు పోతే.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా..?
Dilraju : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కొత్త ఏఐ స్టూడియోను లాంచ్ చేశారు. టాలీవుడ్ లో ఫస్ట్ ఏఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. తాజాగా స్టూడియో ప్రారంభ వేడుక నిర్వహించగా.. దీనికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. Lord Venkateshwara లో ముందు పేర్లతో LorVen అని ఏఐ స్టూడియోకు పేరు పెట్టారు. ఈ వేడుకకు డైరెక్టర్లు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, వి.వి.వినాయక్…
Revanth Reddy: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ పెట్టుబడులు అవసరమన్న దృక్పథంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలు ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు నేడు వెళ్లనుంది. నేటి (ఏప్రిల్ 16) నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా నగరాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో…
Mancherial: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు మంచిర్యాల జిల్లాను సందర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన ఈ ఐదుగురు నేతలు జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా మంత్రి బృందం బయలుదేరి, ఉదయం 11 గంటలకు మంచిర్యాలకు…
Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్రంలో పాలనపై విమర్శలు గుప్పిస్తూ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పై భరోసా వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ గతంలో చేసిన తప్పిదాలను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. “రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది – ఆయనే కొనసాగుతారు” అంటూ స్పష్టంగా తెలిపారు. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ పై విమర్శలు చేస్తూ, “అరవింద్ నిద్రలో కలలు కంటున్నట్టు ఉన్నారు”…