Duddilla Sridhar Babu : సన్న బియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్‌దే
- మంథనిలో 10,200 కొత్త రేషన్ కార్డుల పంపిణీ
- సన్న బియ్యం సరఫరాకు నాంది
- మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ద్వారా 200 కోట్ల టికెట్లు
- అప్పుల భారం మధ్యా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం
- ప్రతీ నెల 6 వేల కోట్లు వడ్డీ చెల్లింపులు
- మినీ ఇండస్ట్రియల్ పార్క్, 3,500 ఇళ్లు మంజూరు
- మంథనిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యం : శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : మంథని నియోజకవర్గంలో అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన పలు ముఖ్య ప్రకటనలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు.
“రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీకి నాంది పలికింది. ప్రతి అర్హ కుటుంబం సకాలంలో సన్న బియ్యం పొందేలా చర్యలు తీసుకుంటున్నాం,” అని అన్నారు. సన్న బియ్యం సరఫరా సక్రమంగా జరిగేలా రెవెన్యూ అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు.
Also Read
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
Rahul Gandhi: ‘‘చనిపోయిన అరుణ్ జైట్లీ ఎలా బెదిరించారు’’.. పప్పులో కాలేసిన రాహుల్ గాంధీ..
సన్న బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల సుమారు రూ. 3 వేల కోట్ల ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందని తెలిపారు. అయినప్పటికీ ప్రజల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
మహిళలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మంత్రి గుర్తుచేశారు. “ఉచిత బస్ ప్రయాణం అమలు చేయడం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 200 కోట్ల ఉచిత టికెట్లను ఉపయోగించుకున్నారు,” అని తెలిపారు.
అంతేకాకుండా, గత ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతీ నెల రూ. 6 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తున్నప్పటికీ, సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తున్నామని చెప్పారు.
మంథని అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రి శ్రీధర్ బాబు, త్వరలో మంథనిలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అదనంగా, 10,200 మందికి కొత్త రేషన్ కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి. మంథనిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా కృతనిశ్చయం,” అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Uttar Pradesh: భర్తను చంపేందుకు భార్య ప్లాన్.. “అపరిచితుడి” రూపంలో బిగ్ ట్విస్ట్..
తాజావార్తలు
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!