Sridhar Babu: అందుకే రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డిని ప్రకటించినప్పుడు తాము తీసుకున్న నిర్ణయాలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మంత్రి వివరణ ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు మేము అందరం నడుస్తాం. ఆ క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పక్ష నేతగా రేవంత్‌రెడ్డిని నిర్ణయించినప్పుడు అందరం కలిసి పని చేయాలని ఆ నాయకుడికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆలోచించాం. అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి మంచి నాయకుడు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపనతో ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి తరువాత మరొకటి పూరించే కార్యక్రమంతో పాటు తెలంగాణాను అభివృద్ధి చేయాలని.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యం ఉంది.
READ MORE: Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం.. “సెకన్ టూ సెకన్” ఏం జరిగిందంటే..?
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ఆ లక్ష్య సాధనలో అనేక పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము కూడా బాధ్యతతో పని చేస్తున్నాం. గత ఏడాదిన్నర కాలంలో దగ్గరగా ఉండి చూస్తున్నాం. ఒక బలమైన, లక్ష్యమున్న నాయకుడి లక్షణాలు సీఎం రేవంత్‌రెడ్డిలో కనిపిస్తున్నాయి. అధిష్టానం అన్ని బేరీజు చేసుకుని ఓ మంచి నిర్ణయం తీసుకుంటుందని నేను నమ్ముతున్నా. ప్రజలకు మేలు జరుగుతలేదు అనే సీఎం రేవంత్‌రెడ్డిలో కనిపించింది. ఒక లక్ష్యం ఉంది. ఒక ఆలోచన ఉంది. అనేక సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ లక్ష్యాన్ని చేరాలని పట్టుదల ఉన్న వ్యక్తిగా కనిపించారు. దానికి తోడు అతడి ప్రణాళికలు, సమయం, సందర్భం అన్ని తీర్ల కలిసి వచ్చింది. కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దలతో కూడా కలిసి నడిచారు. వారు సీఎంగా రేవంత్‌రెడ్డిని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాలకు అనుగుణంగా మేము నడుస్తు్న్నామని మంత్ర శ్రీధర్ బాబు వెల్లడించారు.
READ MORE: Murder : చేతబడుల అనుమానంతో అన్న పీక కోసిన తమ్ముడు
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!