CM Revanth Reddy : ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
- ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
- మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్‌తో రేవంత్ రెడ్డి భేటీ
- సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ రెండు రోజుల పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ప్రస్తుతం టోనీ బ్లెయిర్ ‘టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI)’ అనే సంస్థను నడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ సంస్థతో తెలంగాణలో పెట్టుబడులు, సహకార ప్రాజెక్టులపై చర్చ జరగనుంది.
Also Read
తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలో ఉన్న గోదావరి-బనచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయనుంది. ఈ అంశంపై సమగ్ర నివేదికను కేంద్ర జలవనరుల సంఘం (CWC) అధికారులకు సమర్పించనున్నారు. అంతేకాక, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈ పర్యటనలో చివరగా ఏఐసీసీ నేతలతో సమావేశమై, పార్టీలో పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టుల పంపిణీ వంటి కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!