Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన కారణంగా తమిళనాడులో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి.
గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో ఉమ్రానా మాలిక్ విరుచుకుపడటంతో భారత్ శ్రీలంకను ఓటమిలోకి నెట్టేయగలిగింది.
China holds first Indian Ocean Region meet with 19 countries without India: అవకాశం దొరికితే భారత్ ను ఎలా దెబ్బతీయాలా..? అనే ఆలోచనలోనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా పరిధిలో భారత్ ప్రాముఖ్యత, ప్రాధాన్యత పెరగడాన్ని తట్టుకోలేకపోతోంది చైనా. భారత ప్రాధాన్యతను తగ్గించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల చైనా హిందూ మహాసముద్ర ప్రాంత సమావేశాన్ని నిర్వహించింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు…
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్‌తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. సంక్షోభంలో చిక్కుకున్న పొరుగుదేశమైన శ్రీలంకకు భారత్ సోమవారం 21,000 టన్నుల ఎరువులను అందజేసింది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పని దొరకకపోవడంతో పాటు తినడానికి తిండి కూడా దొరకక యువకులు నేరాలకు పాల్పడుతున్నారు. లంకలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం లంకలోని యువత దొంగలుగా మారుతున్నారు.
తమిళనాడు వ్యాప్తంతా 22 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఇటీవల శ్రీలంక నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై నమోదైన కేసుపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. డ్రగ్స్ మాఫియా, స్మగ్లర్లే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. తమిళనాడులోని చెన్నై. తిరుప్పూర్, చెంగల్పట్టు, తిరుచిరాపల్లి జిల్లాల్లోని నిందితులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. లంక డ్రగ్ మాఫియా సంబంధాల గట్టును కనుక్కునేందుకు ఎన్ఐఏ ఈ రైడ్స్ నిర్వహించింది.