WTC Final: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకముందే న్యూజిలాండ్ టీమిండియా గుడ్‌న్యూస్‌ను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్ సేనకు మార్గం సుగమం చేసింది. అయితే శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో న్యూజిలాండ్‌ను కేన్ విలియమ్సన్ విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా అయినా భారత్ మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లిపోయింది.
సొంతగడ్డపై సత్తా చాటుతూ మొదటి టెస్టులో ఆఖరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు న్యూజిలాండ్ గడ్డపై సర్వశక్తులు ఒడ్డిన శ్రీలంక ఆశలపై ఆఖరి నిమిషంలో కివీస్ నీళ్లు చల్లింది. ఈ ఓటమితో శ్రీలంక పోటీ నుంచి నిష్క్రమించగా భారత్‌కు డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్ బెర్తు ఖరారైంది. కేన్ విలియమ్సన్ (121*) శతకంతో పాటు డారిల్ మిచెల్ (81) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
Read Also: Driver Salary: నెలకి రూ.2 లక్షలు. ఎవరి డ్రైవర్‌కి? ఎప్పుడు? ఏంటా కథ?
తొలి టెస్ట్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 373 పరుగులు చేసి ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 302 పరుగులకు ఆలౌట్ అయింది.