మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది.
పాకిస్థాన్‌కు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం సపోర్ట్ ఇవ్వడం లేదు. ఆసియా కప్ విషయంలో బంగ్లాదేశ్, శ్రీలంకల మద్దతు పాకిస్థాన్‌కు లభించడం లేదు. ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డుల మద్దతు BCCI వైపే తమ మద్దతును ప్రకటించాయి.
చైనా-శ్రీలంక నుంచి లక్ష కోతుల్ని దిగుమతి చేసుకోవటానికి ప్రతిపాదన పెట్టింది. ఇంత భారీ సంఖ్యలో కోతుల్ని దిగుమతి చేసుకోవాలని చైనా అనుకోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
IMF bailout for Sri Lanka: చుట్టూ ఉండే సముద్రపు నీటి మాదిరిగా.. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలతో.. సంక్షోభ సంద్రంలో చిక్కుకున్న శ్రీలంకకు.. IMF రూపంలో శ్రీరామరక్ష లభించింది. ఆ.. ద్వీప దేశానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. నాలుగేళ్లపాటు అమలుచేయనున్న ఈ బెయిలౌట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తక్షణం 333 మిలియన్ డాలర్లు విడుదల చేయనుంది.
Pakistan : శ్రీలంకలో గత ఏడాది ఆర్థిక సంక్షోభం నెలకొంది. భారత్ సహా పొరుగు దేశాల సహకారంతో శ్రీలంక దాని నుంచి ప్రస్తుతం కోలుకుంటుంది. ఈ విషయంలో మరో ఆసియా దేశమైన పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన 16 మంది జాలర్లు, 102 మత్స్యకార బోట్లను త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలను ప్రారంభించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకముందే న్యూజిలాండ్ టీమిండియా గుడ్‌న్యూస్‌ను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్ సేనకు మార్గం సుగమం చేసింది.
దివాళా తీసిన శ్రీలంక వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి సిద్ధంగా ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ రోజు ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో పార్లమెంటును వాయిదా వేయవలసి వచ్చింది.