Pakistan: సహాయంలో కూడా దాయాది దేశం పాకిస్తాన్ నీచంగా ప్రవర్తించింది. గడువు తీరిన సహాయ సామాగ్రిని అందించి, తన బుద్ధి ఏంటో మరోసారి నిరూపించుకుంది. దిత్వా తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిని శ్రీలంకు సాయం చేస్తున్నామని చెబుతూ పాకిస్తాన్ హైకమిషన్ సహాయ ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, వాటిపై ఎక్స్‌పైరీ డేట్ 10/2024గా ఉంది. దీంతో పాకిస్తాన్‌పై విమర్శలు వాన మొదలైంది. గడువు తీరిన ఆహారాన్ని అందించడంపై పాక్ వైఖరిని నెటిజన్లు…
శ్రీలంకపై దిత్వా తుఫాన్ విరుచుకుపడింది. భారీ ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. దీంతో శ్రీలంక అతలాకుతలం అయింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఇప్పటి వరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారు.
దిత్వా తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుఫాను ఆదివారం తెల్లవారుజామున ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణ నష్టం బాగా జరిగింది.
Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
శ్రీలంకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు లోయలో పడి పోయింది. 250 అడుగుల పైనుంచి బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మున్సిపల్ కార్మికులు మృతి చెందారు.
ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ టీమ్స్ తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టాయి. ఆసియా కప్ నేపథ్యంలో మాజీలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ తన అభిపాయాన్ని చెప్పాడు. ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్ అని చెప్పాడు.…
Women’s World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నేడు (జూన్ 2) 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ICC మహిళల 50 ఓవర్ల ప్రపంచ కప్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2, 2025 వరకు భారత్, శ్రీలంకలో జరిగేలా షెడ్యూల్ చేయబడింది. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్…
కువైట్ ఫ్లైట్ లో మిస్సైన పెనగలూరు మండలం పొందలూరు వాసి రాజబోయిన మనోహర్ కథ విషాదాంతం అయ్యింది. మార్గ మధ్య లో రాజబోయిన మనోహర్ పెరాలసిక్ ఎటాక్ కావడంతో ఆయనను ప్లేట్ సిబ్బంది శ్రీలంకలోని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన నిన్న మృతి చెందారు..
Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం శ్రీలంకలోని తేయాకు పండించే కొండ ప్రాంతంలో ఒక ప్రయాణికుల బస్సు కొండపై నుంచి జారిపడి 21 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 36 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు తెలియజేశారు. ఈ ప్రమాదం దేశ రాజధాని కొలంబోకు తూర్పున 140 కి.మీ దూరంలో ఉన్న కోట్మలే పట్టణానికి సమీపంలో, ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.