ఇప్పటికే శ్రీలంకలో వర్షాలు భారీగా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు వర్షం కారణంగా కొన్ని మ్యాచ్ లు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటినుంచి జరగబోయే మ్యాచ్ లకు వర్ష ప్రభావం ఏమీ ఉండదని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై పాక్ లోగో మిస్ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. కావాలనే పాకిస్తాన్ పేరును మిస్ చేశారంటూ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు.
Asia Cup Winners List from 1984 to 2023: ఆసియా దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ‘ఆసియా క్రికెట్ కౌన్సిల్’ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ‘ఆసియా కప్’. ముందుగా కేవలం మూడు జట్లతోనే ప్రారంభమైన ఈ టోర్నీ.. ఇప్పుడు ఆరు టీమ్‌లతో నిర్వహించే స్థాయికి ఎదిగింది. ప్రతి రెండేళ్లకు ఓసారి ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా.. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సందర్భాలూ ఉన్నాయి. ఆసియా కప్ ప్రస్తుతం…
మరి కొన్ని గంటల్లో ఆసియా కప్-2023కు ముందు శ్రీలంక జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లంతా గాయాలు, కోవిడ్ కారణంగా ఒక్కొక్కరుగా టీమ్ కు దూరమవుతున్నారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ తన చెల్లి పెళ్లిలో ఏడ్చేశాడు. అప్పగింతల కార్యక్రమం సందర్భంగా తన సొదరిని, బావను కౌగిలించుకుని హసరంగ కన్నీటి పర్యంతమయ్యాడు. చెల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ స్టార్ క్రికెటర్ బోరున విలపించాడు.
Two Sri Lankan Cricketers tested positive for Coronavirus ahead of Asia Cup 2023 ఆసియా కప్ 2023కి కౌంట్ డౌన్ మొదలయింది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.…
Travel Ban on Sri Lanka Former Cricketer Sachithra Senanayake: శ్రీలంక మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సచిత్ర సేనానాయకే ప్రస్తుతం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కొలంబోలోని స్థానిక కోర్టు అతడు విదేశాలకు వెళ్లకుండా సోమవారం నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. 38 ఏళ్ల సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను…
తాజాగా మరో యువతి.. తాను ప్రేమించిన యువకుడి కోసం దేశం దాటి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఓ యువతి.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని యువకుడు.. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో.. యువతి చిత్తూరు చేరుకుంది. అంతేకాకుండా వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు.
తమిళనాడుకు చెందిన 9 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. సముద్ర సరిహద్దును ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. వారివద్ద నుంచి రెండు మెకనైజ్డ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామనాథపురం జిల్లాలోని మండపానికి చెందిన మత్స్యకారులు సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లగా నిన్న అర్థరాత్రి కచ్చతీవు- నెడుంతీవు మధ్య వారిని అరెస్ట్ చేశారు.
శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లాహిరు తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు శనివారం వీడ్కోలు పలికాడు. అతను సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు.