Mahinda Rajapaksa: మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసిన శ్రీలంక కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahinda Rajapaksa: మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది. మే 9, 2022న కొలంబోలో శాంతియుతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరిగిన ఘోరమైన దాడిలో వారి ప్రమేయంపై దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రాజపక్సే, ఇతరులపై నిషేధం విధించబడింది.
మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్సు కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించాలని రాష్ట్రపతి తరపు న్యాయవాది శవేంద్ర ఫెర్నాండో కోర్టును కోరారు. వాదన విన్న తర్వాత, మేజిస్ట్రేట్ ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో నాలుగో అనుమానితుడైన ఎంపీ మిలన్ జయతిలక్ సహా మరో ఇద్దరిపై విధించిన ప్రయాణ నిషేధాన్ని తదుపరి కోర్టు తేదీకి పొడిగించారు. ముందుగా బెయిల్‌పై విడుదలైన హేవాగమాగే మంజుల, రమేష్ భానుక, చమత్ తివాంక, నిశాంత డి మెల్‌లను కేసు నుంచి విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఆగస్టు 11 వరకు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
Read Also: Tamilnadu: 21 మంది మృతికి కారణమైన మిథనాల్ దుర్ఘటన.. ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
అనేక మంది శ్రీలంక వాసులు ఆహారం, ఇంధనంతో సహా నిత్యావసరాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నందున, మార్చి 2022లో శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రదర్శనల కారణంగా అప్పటి ప్రధాని మహింద రాజపక్స మే 9న రాజీనామా చేయగా, అతని సోదరుడు గొటబాయ రాజపక్స జులై 13న దేశం విడిచి పారిపోయి మరుసటి రోజు రాజీనామా చేశారు. విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. రాజపక్సేల రాజకీయ పార్టీ శ్రీలంక పొదుజన పెరమున మద్దతుతో జూలై 20న పార్లమెంటు అతన్ని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!