Free Tourist Visas: శ్రీలంక దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజంపై ఆ దేశం మరింత దృష్టి పెట్టింది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం టూరిస్టులను ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. భారత్ నుంచే శ్రీలంకకు ఎక్కువ పర్యాటకులు వెళ్తున్న క్రమంలో మన దేశానికి చెందిన పౌరులకు ‘ఫ్రీ టూరిస్ట్ వీసా’లను మంజూరు చేయనున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషషన్ శాఖ కొలంబోలో ప్రకటించింది.
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ శ్రీలంకలో నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. ఇప్పుడు వేదికను మర్చారు. ఈరోజు అహ్మదాబాద్‌లో సమావేశమైన ఐసీసీ బోర్డు.. 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డులో కొనసాగుతున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఆతిథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికాకు మార్చారు.
బీసీసీఐ సెక్రటరీ జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశాడంటూ జై షాపై.. ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. శ్రీలంక పార్లమెంట్‌లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున జై షాకు క్షమాపణలు తెలుపుతున్నట్లు చెప్పారు.
Sri Lanka Cricket suspended by ICC: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ విధించింది. ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఎస్‌ఎల్‌సీ పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నందుకు శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ…
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో శ్రీలంక ఖాతాలో మరో ఓటమి నమోదైంది. మరోవైపు న్యూజిలాండ్ కు ఈ విజయంతో సెమీస్ అవకాశాలు మరింత బలమయ్యాయి. కాగా.. సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న పాక్ జట్టు ఆశలు గల్లంతయ్యాయి.
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు కివీస్ బౌలర్లకు పెరెరా చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి అర్ధసెంచరీ సాధించాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకుంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఢిల్లీలో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ తొలిసారిగా శ్రీలంకను ఓడించింది. బంగ్లా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
UPI in Sri Lanka: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం శ్రీలంకలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. గురువారం శ్రీలంకలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు.