ICC-SLC: ఐసీసీ కీలక నిర్ణయం.. శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka Cricket suspended by ICC: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ విధించింది. ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఎస్‌ఎల్‌సీ పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నందుకు శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఐసీసీ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీలంక బోర్డు స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని, సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. సస్పెన్షన్‌కు సంబంధించిన షరతులను ఐసీసీ నిర్ణీత సమయంలో నిర్ణయిస్తుందని పేర్కొంది. నవంబర్ 21న ఐసీసీ సమావేశమవుతుందని, ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
Also Read: Virat Kohli: మంచి బ్యాటర్ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిది: కోహ్లీ
జనవరి-ఫిబ్రవరి నెలల్లో ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2024కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తాజా పరిణామంతో అండర్-19 ప్రపంచకప్ నిర్వహణ విషయంలో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక ప్రపంచకప్ 2023లో శ్రీలంక దారుణంగా విఫలమైంది. 9 లీగ్ మ్యాచ్‌లకు 2 మాత్రమే గెలిచి.. పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌పై విజయం సాధించిన శ్రీలంక.. మిగతా మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!