PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఐ నివేదిక ద్వారా మన దేశానికి చెందిన ‘కచ్చతీవు’ ద్వీపాన్ని శ్రీలంకకు ఎలా అప్పగించిందనే వివరాలు వెల్లడైన తర్వాత, ప్రధాని నరేంద్రమోడీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
తమిళనాడులో శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల డ్రగ్స్ ను డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు సీజ్ చేశారు. మండపం తీరంలో ఓ కంట్రీ బోటు నుంచి అక్రమంగా తరలిస్తున్న 99 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ అధికారి వెల్లడించారు. డ్రగ్స్ తో వెళ్తున్న పడవ శ్రీలంక వైపు వెళుతుండగా.. పక్కా సమాచారంతో అధికారులు బోటును వెంబడించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.
Isro: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కి శంకు స్థాపన చేశారు. తమిళనాడు కులశేఖరపట్టణంలో ఈ స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఇన్నాళ్లు ఇస్రో రాకెట్ ప్రయోగాలకు కేరాఫ్‌గా ఏపీలోని శ్రీహరికోట ఉంది. గత దశాబ్దాలుగా ఈ శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 700 కిలోమీటర్ల దూరంలో కొత్త స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ని చిన్న శాటిలైట్స్, లోఎర్త్ఆర్బిట్(LEO)లోకి ప్రయోగించే ఉపగ్రహాల కోసం ఉపయోగించనున్నారు.
Indian Fishermen: శ్రీలంక మరోసారి భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసింది. తమిళనాడు రామేశ్వరానికి చెందిన 23 మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో వీరి అరెస్ట్ జరిగింది. 23 మంది జాలర్లను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నేవీ అధికారులు ఆదివారం తెలిపారు. పార్క్ బే సముద్ర ప్రాంతంలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో మత్స్యకారులు చేపలు పట్టినట్లు మత్స్యకార సంఘం పేర్కొంది.
Indian Fishermen: శ్రీలంక నేవీ మరో 10 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసి, వారి పడవల్ని స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల క్రితం ఇలాగే 12 మందిని అరెస్ట్ చేసింది. శ్రీలంక జాఫ్నాలోని పాయింట్ పెడ్రోకి ఉత్తరాన ఆదివారం నాడు మత్స్యకారుల్ని అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. పట్టుబడిన పది మంది మత్స్యకారులను కంకేసంతురై హార్బర్‌కు తరలించి తదుపరి చర్యల నిమిత్తం మైలాడి ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తామని తెలిపారు.
శ్రీలంక నావికాదళం 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. అంతేకాకుండా.. దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడటం కోసం వాడే వారి పడవలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర జాఫ్నా ద్వీపంలోని కరైనగర్ తీరంలో శనివారం మత్స్యకారులను అరెస్టు చేసి, వారి మూడు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి చర్యల నిమిత్తం ఈ మత్స్యకారులను కంకేసంతురై ఓడరేవుకు తరలించారు.
Dhananjaya de Silva New Test Captain for Sri Lanka: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్‌గా ధనంజయ డిసిల్వాను నియమించింది. ఈ విషయాన్ని చీఫ్ సెలక్టర్ ఉపుల్ తరంగ ఓ ప్రకటనలో తెలిపాడు. దిముత్ కరుణరత్నె స్థానంలో ధనంజయ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ దసున్ శనకను తప్పించిన ఎస్ఎల్సీ.. వన్డేల బాధ్యతలు కుశాల్ మెండిస్‌కు, టీ20…
Sri lanka: ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ద్వీపదేశం శ్రీలంక, ఇప్పుడు కరెంట్ కష్టాలను ఎదుర్కొంటోంది. విద్యత్ సిస్టమ్ వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా కరెంట్ లేకుండా పోయింది. శ్రీలంక మొత్తం అంధకారంలో ఉంది.