HCA-SRH : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కొనసాగుతున్న వివాదానికి శుభం కార్డు పడింది. బీసీసీఐ, హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ప్రధాన అంశాలు: కాంప్లిమెంటరీ పాసులు: పాత ఒప్పందం ప్రకారమే…
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మధ్య కాంప్లిమెంటరీ టిక్కెట్ల (ఉచిత పాస్‌లు) వివాదం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని.. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వీడి మరో రాష్ట్రాన్ని హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంటామని ఎస్‌ఆర్‌హెచ్ స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం కోరింది. మరోవైపు ఈ వ్యవహారంపై…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య కాంప్లిమెంటరీ టిక్కెట్ల (ఉచిత పాస్‌లు) వివాదం రోజురోజుకు ముదురుతోంది. హెచ్‌సీఏ బ్లాక్ మెయిలింగ్ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఆదివారం కోరింది. వెంటనే ఈ వివాదంను పరిష్కారించాలని సన్‌రైజర్స్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మరి ఈ వివాదం ఎక్కడివరకు దారితీస్తుందో చూడాలి. Also Read: Kalyan Shankar: కక్కుర్తి, స్వార్ధం.. ‘మ్యాడ్ స్క్వేర్’…
ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పేరు అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీల్లో మార్మోగిన విషయం తెలిసిందే. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ తమను దారుణంగా హింసిస్తోందని, వేధింపులు ఇలానే కొనసాగితే హైదరాబాద్ నగరాన్ని ఫ్రాంఛైజీ వీడిపోవడానికి సిద్ధంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఓ లేఖ రాసినట్లు న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై హెచ్‌సీఏ అధికార ప్రకటన విడుదల చేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘ఎస్‌ఆర్‌హెచ్‌యాజమాన్యం…
నిత్యం వివాదాల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)ను బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ హైదరాబాద్ నగరాన్ని వీడిపోతామని హెచ్చరించింది. ఐపీఎల్ 2025 సందర్భంగా కోరినన్ని ఫ్రీ పాస్‌లు ఇవ్వనందుకు ఓ మ్యాచ్‌లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్లు సన్‌రైజర్స్ ప్రతినిధి ఒకరు హెచ్‌సీఏ కోశాధికారికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.…
ఇషాన్ కిషన్ అద్బుత ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక విషయాలు వెల్లడించారు. ఇషాన్ కిషన్.. ముంబై ఇండియన్స్ (MI)కు ఆడిన సమయంలో వెనుకబడిపోయాడని.. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో అతనికి కావాల్సిన స్వేచ్ఛ లభించిందని అభిప్రాయపడ్డారు.
మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ మహా సంగ్రామం మొదలవబోతుంది. అందుకోసం అన్నీ జట్లు తమ హోంగ్రౌండ్‌లలో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అందులో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తన అద్భుత షాట్లతో చెప్పి మరీ స్టేడియంలోని అద్దాలను పగలగొట్టాడు.
Nitish Kumar Reddy: ఐపీఎల్ 2025 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈసారి మరింత బలమైన స్క్వాడ్‌ను సిద్ధం చేసుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి హిట్టర్లకు తోడుగా, ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన ఇషాన్ కిషన్ కూడా SRH లో చేరాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరు గత సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. వీరికి తోడుగా శ్రీలంక ఆటగాడు కామిందు మెండిస్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మ్యాచ్‌లు మార్చి 22 నుంచి ఆరంభం కానున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు తీసుకొస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూ.5…