కీలక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని చావుదెబ్బ కొట్టింది. ఈ ఓటమితో క్వాలిఫయర్ వన్‌కి అర్హత సాధించాలని భావించిన ఆర్సీబీకి చుక్కెదురైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
చివరి మూడు మ్యాచ్ ల్లో గెలిచి పరువు నిలుపుకోవాలన్న సన్ రైజర్స్ కు హెడ్ రూపంలో భారీ షాక్ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరగనున్న మ్యాచ్ కి ముందు ఆ జట్టు స్టార్ ఆటగాడు, ట్రావిస్ హెడ్ కరోనా బారీన పడ్డాడు. ప్రస్తుతం హెడ్ ఆస్ట్రేలియాలో ఐసొలేషన్ లో ఉన్నాడు.
భారత పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా హత్య బెదిరింపులు పంపిన దుండగులు.. రూ.కోటి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని షమీ సోదరుడు హసీబ్ సోమవారం ఓ జాతీయ మీడియాకు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మెయిల్ వచ్చిందని, వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం అని వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్‌పుత్ సిందార్ అనే వ్యక్తి మెయిల్…
అంతన్నారు, ఇంతన్నారు.. కాటేరమ్మ కొడుకులని ఆకాశానికి ఎత్తేశారు.. ఆరెంజ్ అంటే ఓ రేంజిలో ఉంటదని డీజేలు పెట్టారు, జేజేలు కొట్టారు. అన్నట్టే ఫస్ట్ మ్యాచే రాజస్థాన్ మీద రాయల్ విక్టరీ కొట్టారు. అంతే ఇగ ఖతం.. టాటా… గుడ్ బై!. పాయింట్ల పట్టికలో పైనున్న వాళ్లు ఠపీమని కిందపడిపోయారు, ఇంక లేవలేదు. ముక్కీ మూలిగీ మూడు మ్యాచ్‌లు గెలిచారు. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుని, అస్సాం రైలెక్కారు. కూకట్‌పల్లి క్లాసెన్ అన్నారు.. హయత్ నగర్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను 38 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగినా పోరాటం వృథా అయ్యింది. Also Read:Viral…
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నాలుగు టీమ్స్ పాయింట్ల పట్టికలో టాప్ -4లో కొనసాగుతున్నాయి. 10 పాయింట్లతో…
ఐపీఎల్ 2025 మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్ లేదా కమిన్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పాట్ భార్య బెక్కీ కమ్మిన్స్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఊహాగానాలుగా మొదలయ్యాయి.
దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ విజయ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారు. తమ కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని హనుమంతుడిని కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరం అంతటా హనుమాన్ జయంతి వేడుకల సందడి నెలకొంది. హనుమాన్ జయంతి వేళ పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రీతి జింటా…
HCA-SRH : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కొనసాగుతున్న వివాదానికి శుభం కార్డు పడింది. బీసీసీఐ, హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ప్రధాన అంశాలు: కాంప్లిమెంటరీ పాసులు: పాత ఒప్పందం ప్రకారమే…