హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హెచ్ సీఏలో లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో HCA సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఈడి గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే HCA మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను విచారించింది ఈడీ. రూ. 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు…
Varun Aaron: ఐపీఎల్ 2025లో పేలవమైన ప్రదర్శనతో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇప్పుడు పునర్నిర్మాణ మార్గంలో అడుగులు వేస్తోంది. నష్టాలన్నో ఎదుర్కొన్న అనంతరం, ఫ్రాంఛైజీకి కీలక మార్పులు అవసరమేనని స్పష్టమయ్యింది. ఇందులో భాగంగా ఇప్పడు మార్పులు కార్యరూపం దాల్చుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ గా ప్రఖ్యాత పేసర్ డేల్ స్టెయిన్ తప్పుకున్న తర్వాత, జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించిన SRH.. అతని హయంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో మార్పుకు పూనుకుంది. తాజాగా…
HCA President Jaganmohan Rao Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ స్కామ్‌పై పూర్తి వివరాలు కావాలని తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)ను ఈడీ కోరింది. హెచ్‌సీఏలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. హవాలా, మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్‌సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీ…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో 12 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్‌తో పాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితకు మల్కాజ్‌గిరి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చంచల్ గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. Also Read: Kanipakam Temple: విరిగిన…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావును తెలంగాణ సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో టికెట్ల వివాదం నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో.. జగన్‌మోహన్‌ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. జగన్‌మోహన్‌తోపాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అరెస్ట్ చేసి విచారించింది. ఈ కేసులో సంచలన విషయాలు…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాల చిట్టా కలకలం రేపుతోంది. హెచ్‌సీఏలో జగన్మోహన్ రావు అక్రమాలకు అంతే లేదు. హెచ్‌సీఏలోకి అడ్డదారిలో వచ్చిన ఆయన.. వందల కోట్లు దోపిడీ చేశారు. క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులను జగన్మోహన్ రావు దుర్వినియోగం చేశారు. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా బుధవారం జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు మల్కాజిగిరి కోర్టులో ఆయన్ను సీఐడీ హాజరుపరచనుంది. జగన్మోహన్‌తో…
ఎస్ఆర్హెచ్, హెచ్‌సీఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సీఐడీ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌తో పాటు బాడీని అదుపులోకి తీసుకుంది. గత ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని ఆరోపిస్తూ.. కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసింది హెచ్‌సీఏ. ఈ ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మ్యాచ్ ఆడుతుందంటే.. ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్ పైనే అందరి కళ్లు ఉంటాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను ఉత్సహపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం నిరాశగా ఉంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కావ్య పాపపై ఎక్కువగా మీమ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా తనపై వచ్చే మీమ్స్‌పై స్పందించారు. క్రికెట్ మీద తనకున్న మక్కువ వల్లే తాను…
హెచ్‌సీఏ అక్రమాలపై సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిగింది. హెచ్‌సీఏ సెక్రటరీ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారణ అయింది.
‘పుతిన్ పిచ్చోడు’.. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడిపై ట్రంప్ ఆగ్రహం గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసిన తర్వాత కఠిన వైఖరి తీసుకున్నారు. న్యూజెర్సీలోని మోరిస్టౌన్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ, “నేను పుతిన్ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు…