Nitish Kumar Reddy: ఐపీఎల్ 2025 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈసారి మరింత బలమైన స్క్వాడ్‌ను సిద్ధం చేసుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి హిట్టర్లకు తోడుగా, ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన ఇషాన్ కిషన్ కూడా SRH లో చేరాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరు గత సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. వీరికి తోడుగా శ్రీలంక ఆటగాడు కామిందు మెండిస్ జట్టులోకి వచ్చాడు. బౌలింగ్ విభాగంలో కూడా SRH మరింత బలంగా మారింది. భారత దిగ్గజ బౌలర్ మహ్మద్ షమీ, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, రాహుల్ చాహార్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ జట్టులో చేరారు.
Read Also: Rajiv Yuva Vikasam Scheme: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం..
ఈ సీజన్‌లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు తోడుగా మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను చేపట్టబోతున్నారు. కొత్త బౌలింగ్ లైనప్‌తో SRH ప్రత్యర్థి జట్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈసారి SRH జట్టులో ఉన్న ఏకైక తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే. గత సీజన్లో అద్భుత ప్రదర్శన ఇచ్చి టీమిండియా టీ20 జట్టులో చోటు సంపాదించుకున్న నితీష్, భారత జట్టు తరఫున కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడటంతో కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని, ఐపీఎల్ 2025 కోసం సిద్ధంగా ఉన్నాడు.
NKR is here 🔥
Nitish Kumar Reddy | #PlayWithFire pic.twitter.com/X1DeNlOu2R
— SunRisers Hyderabad (@SunRisers) March 16, 2025
తాజాగా SRH క్యాంపులో చేరిన నితీష్ కుమార్ రెడ్డి, ‘సాలార్’ లోని కాటేరమ్మ కొడుకుగా మారిన వీడియోతో అభిమానులను అలరించాడు. ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన “కాటేరమ్మ ఫైట్”లో కత్తులు వెనక ఉన్నట్లు చూపించినట్లు, నితీష్ వెనకాల బ్యాట్‌లు కత్తుల్లా కనిపించాయి. ఈ క్రియేటివ్ ప్రెజెంటేషన్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొత్తానికి సీనియర్లు, జూనియర్లతో SRH జట్టు బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టును మరింత బలోపేతం చేశారు. ఈసారి SRH కొత్త రికార్డ్స్ ఎన్ని సాధిస్తుందో చూడాలి మరి.