Varun Aaron: ఐపీఎల్ 2026 కోసం కొత్త బౌలింగ్ కోచ్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Aaron: ఐపీఎల్ 2025లో పేలవమైన ప్రదర్శనతో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇప్పుడు పునర్నిర్మాణ మార్గంలో అడుగులు వేస్తోంది. నష్టాలన్నో ఎదుర్కొన్న అనంతరం, ఫ్రాంఛైజీకి కీలక మార్పులు అవసరమేనని స్పష్టమయ్యింది. ఇందులో భాగంగా ఇప్పడు మార్పులు కార్యరూపం దాల్చుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ గా ప్రఖ్యాత పేసర్ డేల్ స్టెయిన్ తప్పుకున్న తర్వాత, జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించిన SRH.. అతని హయంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో మార్పుకు పూనుకుంది. తాజాగా SRH కొత్త బౌలింగ్ కోచ్‌గా మాజీ భారత పేసర్ వరుణ్ ఆరోన్ ను నియమించింది.
Read Also:Lords Test: ఫలించని జడేజా పోరాటం.. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ విజయ కేతనం..!
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఇటీవలి కాలంలో కామెంటరీ బాక్స్‌లో తన అద్భుతమైన క్రికెట్ జ్ఞానం, వ్యూహాత్మక ఆలోచనలతో వరుణ్ ఆరోన్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి జట్టుకు బలమైన బౌలింగ్ యూనిట్‌ను తీర్చిదిద్దేందుకు వరుణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. వరుణ్ ఆరోన్ ఇంగ్లాండ్‌లో ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు కామెంటరీ చెబుతూ ఉన్నారు. ఆయన కామెంటరీ చేస్తుండగానే లార్డ్స్ టెస్ట్ మధ్యలో ఈ ప్రకటన విడుదలైంది.
వరుణ్ ఆరోన్‌కి ఐపీఎల్‌లో విశేష అనుభవం ఉంది. ఆర్సీబి, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ XI పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి ఆరు జట్ల తరపున ఆడాడు. ఐపీఎల్‌లో మొత్తం 52 మ్యాచ్‌లలో 44 వికెట్లు తీసిన అతను చివరిసారి 2022 సీజన్‌లో కనిపించాడు. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో అతను 9 టెస్టులు, 9 వన్డేలు ఆడిన అనుభవం ఉంది. మొత్తంగా.. ఈసారి కొత్త బౌలింగ్ కోచ్‌గా వరుణ్ ఆరోన్ బాధ్యతలు చేపట్టడం వల్ల, SRH తమ బౌలింగ్ విభాగాన్ని పునరుద్ధరించి పోటీకి సిద్ధంగా చేయాలనే లక్ష్యంతో ఉంది. వరుణ్ దేశీయ, అంతర్జాతీయ అనుభవం జట్టుకు విజయాన్ని అందిస్తుందని భావిద్దాం.
A fiery addition to our coaching staff! Welcome Varun Aaron as our new bowling coach 🔥🧡#PlayWithFire pic.twitter.com/qeg1bWntC5
— SunRisers Hyderabad (@SunRisers) July 14, 2025
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!