HCA: మాజీ మంత్రి సంతకం ఫోర్జరీ, వందల కోట్లు దోపిడీ.. జగన్మోహన్‌రావు అక్రమాల చిట్టా పెద్దదే!
- ఫోర్జరీ పత్రాలతో హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్మోహన్
- హెచ్‌సీఏలో వందల కోట్లు దోపిడీ
- క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాల చిట్టా కలకలం రేపుతోంది. హెచ్‌సీఏలో జగన్మోహన్ రావు అక్రమాలకు అంతే లేదు. హెచ్‌సీఏలోకి అడ్డదారిలో వచ్చిన ఆయన.. వందల కోట్లు దోపిడీ చేశారు. క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులను జగన్మోహన్ రావు దుర్వినియోగం చేశారు. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా బుధవారం జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు మల్కాజిగిరి కోర్టులో ఆయన్ను సీఐడీ హాజరుపరచనుంది. జగన్మోహన్‌తో పాటు శ్రీనివాసరావు, సునీత్, రాజేందర్ యాదవ్, కవితను సీఐడీ అరెస్టు చేసింది.
హెచ్‌సీఏ అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) అధ్యక్షుడు గురువారెడ్డి వివరంగా మాట్లాడారు. ‘హెచ్‌సీఏలో జగన్మోహన్ రావు అక్రమాలకు పాల్పడ్డాడు. హెచ్‌సీఏలోకి అక్రమంగా జగన్మోహన్ ఎన్నిక అయ్యాడు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కి సభ్యత్వం లేకపోయినా.. ఫోర్జరీ చేసి ఎన్నికల్లో నిలబడ్డాడు. గౌలిపుర క్రికెట్ క్లబ్ సెక్రటరీ సంతకాలను ఫోర్జరీ చేశారు. మాజీమంత్రి కృష్ణ యాదవ్ సంతకాలని ఫోర్జరీ చేసి ఎన్నికల్లో దిగారు. జగన్మోహన్, రాజేంద్ర యాదవులు కలిసి హెచ్‌సీఏలో అక్రమాలు చేశారు. జగన్మోహన్ వందల కోట్ల రూపాయలను హెచ్‌సీఏ నుంచి దోచుకున్నాడు. క్రికెట్ డెవలప్మెంట్ కోసం బీసీసీఐ ఇస్తున్న నిధులు మొత్తం సొంతానికి వాడేసుకున్నాడు. హెచ్‌సీఏలో సభ్యత్వానికి అర్హత లేకపోయినా దొడ్డి దారిన జగన్మోహన్ వచ్చాడు. తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల్లో నిలబడ్డాడు’ అని గురువారెడ్డి చెప్పారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Kurnool POCSO Court: నాలుగేళ్లపై బాలికపై అత్యాచారం.. కర్నూలు పొక్సో కోర్టు సంచలన తీర్పు!
‘జగన్మోహన్ రావు సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేయిస్తాడు. జగన్మోహన్ కోర్టు అడ్వకేట్‌లకు సంబంధించి వ్యతిరేక పార్టీ అడ్వకేట్‌లో కూడా డబ్బులు చెల్లిస్తాడు. జగన్మోహన్ చేయబట్టి హెచ్‌సీఏ పరువు పోయింది. అనధికారికంగా పలు క్లబ్బులకు జగన్మోహన్ డబ్బులు పంచాడు. సుప్రీంకోర్టు కమిటీ 57 క్లబ్బులను సస్పెండ్ చేస్తే అనధికారకంగా మళ్లీ చేర్చుకున్నాడు. ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమాలు జగన్మోహన్ చేశాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. జగన్మోహన్ ఆర్థిక నేరాలు, ఫోర్జరీ సంతకాలు, నిధుల దుర్వినియోగం, ఐపీఎల్ ప్రాంచైజీ బెదిరింపుల దర్యాప్తు జరుగుతుంది. హెచ్‌సీఏ కమిటీని వెంటనే రద్దు చేయాలి. హెచ్‌సీఏ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని గురువారెడ్డి కోరారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!