హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో 12 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్‌తో పాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితకు మల్కాజ్‌గిరి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చంచల్ గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.
Also Read: Kanipakam Temple: విరిగిన పాలతో అభిషేకం.. స్పందించిన కాణిపాకం ఆలయ ఈవో!
హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు చేశారని, పదవి చేపట్టాక భారీగా నిధులు మళ్లించారని జగన్మోహన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి, ఆ పత్రాలను జగన్మోహన్‌కు అందించారని.. ఆ పత్రాలతో హెచ్‌సీఏ అధ్యక్షుడైనట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌ను అరెస్టు చేసినట్లు సీఐడీ గురువారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది.