ఇండోర్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా బ్యాట్స్మెన్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీలు చేశారు. గిల్ 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరి సెంచరీలతో ప్రపంచకప్‌పై మరింత ఉత్సాహాన్ని పెంచారు.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు.. ప్రధాన మార్పులతో రెండో వన్డే ఆడనుంది. రేపు (ఆదివారం) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. 277 టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. చివరకు ఆడి గెలిపించారు.
ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 4న ప్రారంభంకానుంది. ఈ టోర్నీ టైటిల్ మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ICC T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్‌లలో జరుగనున్నాయి. తొలిసారిగా అమెరికా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది.
ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. జనవరి 14న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీని కొలంబో మినహా 5 వేదికల్లో నిర్వహించనున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 4న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ లో వారిని పక్కనపెట్టడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. పరస్పర సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతినిస్తున్నట్టు రోహిత్, కోహ్లీలకు సమాచారం అందించామని, వారు అంగీకరించారని వెల్లడించారు.
వన్డేలలో ఆడటానికి బౌలింగ్ ఒక్కటే సరిపోదని.. బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా ముఖ్యమని అమిత్ మిశ్రా అన్నాడు. అశ్విన్ మంచి బౌలర్, వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పాడు. కానీ వన్డేల్లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి తీసుకోరని.. 40 ఓవర్ల ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుందని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.