ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవమైన ప్రదర్శన చూపించడంతో ఆ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆసియా కప్ లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ చేరుకోలేదు. దీంతో ఇప్పుడు వన్డే ప్రపంచకప్లో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును ప్రకటించారు. అయితే ఈ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ టీమిండియా వన్డే జట్టులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుండి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. దీని కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు.
12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవాలని.. టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు.
సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ వన్డే సిరీస్కు జట్టును ఈరోజు రాత్రి 8:30 గంటలకు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించే అవకాశం ఉంది.
వాషింగ్టన్ సుందర్ ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై వాషింగ్టన్ సుందర్ 15.2 ఓవర్లు మాత్రమే ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే వాషింగ్టన్ సుందర్ భారత జట్టుకు ఆసియా కప్ టైటిల్ను అందించాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. సిరాజ్ బౌలింగ్ చేయొద్దని కోచ్ నుంచి సందేశం వచ్చిందని చెప్పాడు. సిరాజ్ 7వ వికెట్ పడగొట్టి ఉంటే.. భారత్ తరఫున వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా స్టువర్ట్ బిన్నీ రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ ఇచ్చిన సందేశంతో సిరాజ్ బౌలింగ్ చేయలేదు.