ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ లో వారిని పక్కనపెట్టడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. పరస్పర సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతినిస్తున్నట్టు రోహిత్, కోహ్లీలకు సమాచారం అందించామని, వారు అంగీకరించారని వెల్లడించారు.
వన్డేలలో ఆడటానికి బౌలింగ్ ఒక్కటే సరిపోదని.. బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా ముఖ్యమని అమిత్ మిశ్రా అన్నాడు. అశ్విన్ మంచి బౌలర్, వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పాడు. కానీ వన్డేల్లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి తీసుకోరని.. 40 ఓవర్ల ఫీల్డింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుందని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవమైన ప్రదర్శన చూపించడంతో ఆ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆసియా కప్ లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ చేరుకోలేదు. దీంతో ఇప్పుడు వన్డే ప్రపంచకప్లో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును ప్రకటించారు. అయితే ఈ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ టీమిండియా వన్డే జట్టులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుండి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. దీని కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు.
12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవాలని.. టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు.