Heath Streak Death: జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ 49 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. ఇంతకుముందు ఆయన మరణం గురించి చాలా సార్లు పుకార్లు వినిపించాయి.
Hockey 5s Asia Cup 2023: వరుణుడి దెబ్బకి ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత దాయాదిలు బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా ఉంటుంది అభిమానులు తెగ సంబరపడ్డారు.
అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని విశాఖవాసి ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఐపీఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు "సైడ్ ఆర్మ్ త్రో" బౌలర్‌గా ఈశ్వర్ సేవలు అందిస్తున్నారు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయం సాధించినందుకు భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారతీయుడు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో కరుణ్ నాయర్ చెలరేగాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా నాయర్ కొనసాగుతుండగా.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
ఫైనల్స్‌లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. IBSA వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సాధించింది.
ఉత్కంఠభరిత పోరులో నంబర్ వన్ ఆటగాడు కార్ల్ సన్ విజయం సాధించాడు. దీంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా కార్ల్ సన్ అవతరించాడు. ఫైనల్లో భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు.