సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా భయపెట్టడమే కాకుండా బెదిరించారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఎంపీ…
‘ప్రోబా-3’ మిషన్ విజయవంతమైంది: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ59 వాహక నౌక నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహక నౌక కక్ష్యలోకి ప్రవేశించింది. సాంకేతిక లోపం కారణంగా బుధవారం చేపట్టాల్సిన ప్రయోగం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమ్నాథ్ తెలిపారు. ప్రయోగం విజయవంతంతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అనుకున్న…