శాసన మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరు? పోటీ పడుతున్న ఎమ్మెల్సీలు ఎవరెవరు? అధిష్టానం మనసులో ఉన్నదెవరు? కౌన్సిల్‌లో అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉందని కారు పార్టీ పెద్దలు భావిస్తున్నారు? దాంతో పాటు వాళ్ళు చెబుతున్న ఈక్వేషన్స్ ఏంటి? తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర నెలలవుతోంది. రెండు విడతల అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి. ప్రభుత్వం చీఫ్ విప్, విప్ లను ప్రకటించింది. ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్స్‌ని ప్రకటించాయి.…
మన దేశంలో భక్తులు ఎక్కువ.. దేవుడు అంటే భక్తి ఎక్కువ అందుకే వీధికి ఒక గుడి దర్శనం ఇస్తుంది.. అంతేకాదు ఇండియా లో ఆంజనేయ స్వామికి భక్తులు ఎక్కువగా ఉంటారు.. ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కష్టాలను గట్టెక్కిస్తాడని నమ్మకం..హనుమంతుడికి ఇష్టమైన వాటిలో తమలపాకులు అలాగే సింధూరం కూడా ఒకటి. హనుమాన్ ని పూజించేందుకు సింధూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయట.…
Special Story on Vinayaka Nimajjanam: మన దేశంలో ఇన్ని రోజులు ఇంత మంది జనం కలిసిమెలిసి చేసుకునే పండుగ వినాయకచవితి తప్ప మరొకటి లేదేమో. గణేషుడి పుట్టిన రోజున ఘనంగా మొదలయ్యే ఈ నవరాత్రి ఉత్సవాలు నిరాటంకంగా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య సాగాయి. బొజ్జగణపయ్య బొమ్మలను పూజల కోసం కొలువు దీర్చిన పవిత్రమైన క్షణం నుంచి గంగమ్మ ఒడిలోకి చేర్చే గడియ వరకు ప్రతి రోజూ ప్రతిఒక్కరూ ఈ వేడుకల్లో ఆద్యంతం పాల్గొన్నారు.
Special Story on Teacher's Day: ఈ రోజు సెప్టెంబర్ 5. టీచర్స్ డే. టీచ్ అంటే బోధించటం (లేదా) నేర్పటం. మనకు తెలియని విషయాలను తెలియజేసే ప్రతిఒక్కరూ టీచర్లే. పుట్టిన దగ్గరి నుంచి గిట్టే వరకు మనం ఎన్నో అంశాలను నేర్చుకుంటాం. ఆ క్రమంలో మనకు ఎందరో టీచర్లు. ప్రతి వ్యక్తి జీవితమూ పలువురితో ముడిపడి ఉంటుంది. అందుకే ఏడాదిలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్న మంచి సంస్కృతి మన సమాజంలో కొనసాగుతోంది.