Off The Record : టీడీపీలో ‘డోన్’ రగడ.. వర్గ పోరుతో సైకిల్ కు పంక్చర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో లేకపోయినా ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గపోరు ఎక్కువే. ముఖ్యంగా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వీటిలో డోన్ టీడీపీ నివురు గప్పిన నిప్పులా మారింది. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా మన్నె సుబ్బారెడ్డిని ప్రకటించినప్పటి నుంచీ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వర్గం గుర్రుగా ఉంది. తరచూ సుబ్బారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారట. డోన్‌లో పార్టీ బాధ్యతలు తిరిగి కేఈ కుటుంబానికే ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ నియోజకవర్గంలో అప్పట్లో కరపత్రాలు కూడా పంచారు. కానీ.. సుబ్బారెడ్డికే పగ్గాలు అప్పగించడంతో కేఈ ప్రభాకర్ కొంతకాలం సైలెంట్ అయ్యారు. అధినేత నిర్ణయం వారికి రుచించ లేదు. సమయం కోసం చూశారో ఏమో.. ప్రభాకర్ తన జన్మదిన వేడుకల్లో ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలే టీడీపీలో సెగలు రాజేస్తోంది.
Also Read : Bandi Sanjay : 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర.. ర్యూట్ మ్యాప్ ఆవిష్కరణ
సుబ్బారెడ్డే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి డోన్‌లో పోటీ చేస్తారని పార్టీ అధినేత గతంలోనే స్పష్టం చేశారు. ఆ మేరకు సుబ్బారెడ్డి నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు కూడా. ఇంతలో కేఈ కుటుంబమే డోన్ బరిలో ఉంటుందని ప్రకటించారు ప్రభాకర్. ఆ ప్రకటన కలకలం రేపుతోంది. పత్తికొండ, డోన్ రెండుచోట్లా పోటీ చేస్తామన్నది మాజీ మంత్రి మాట. అంతేకాదు.. ఏ అనుభవం లేని వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ఇటీవల కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత పర్యటనపై తెలుగు తమ్ముళ్లు చర్చిస్తున్న తరుణంలో ప్రభాకర్ వ్యాఖ్యలు వాళ్లకు షాక్ ఇచ్చాయట.
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
ప్రభాకర్ కామెంట్స్‌తో దేశం శిబిరంలో గందరగోళం
డోన్‌లో 2014, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి ఆయనే ఇక్కడ పార్టీ ఇంఛార్జ్. వరసగా రెండుసార్లు ఓడిపోవడంతో మనస్తాపం చెందారో ఏమో.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ప్రతాప్. దాంతో పార్టీకి నియోజకవర్గంలో ఎవరూ దిక్కులేకుండా పోయారు. ఆ సమయంలోనే ఇంఛార్జ్‌గా సుబ్బారెడ్డిని ఎంపిక చేసింది టీడీపీ అధిష్ఠానం. సుబ్బారెడ్డే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టత ఇవ్వడంతో కేడర్ కూడా దానికి తగ్గట్టుగానే ట్యూన్ అయ్యిందట. అయితే కేఈ ప్రభాకర్ తాజా కామెంట్స్‌తో సీన్ రివర్స్ అయ్యింది. పసుపు శిబిరంలో మరోసారి గందరగోళానికి దారితీశాయి ఆ వ్యాఖ్యలు.
డోన్ సమస్య పరిష్కారం టీడీపీకి సవాలేనా?
డోన్, పత్తికొండ సీట్ల విషయంలో కేఈ కుటుంబం పట్టుపడితే టీడీపీ అధినేత ఏం చేస్తారు? తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? ముఖ్యంగా డోన్ విషయంలో ఏం చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. వచ్చే ఎన్నికలు కీలంగా భావిస్తున్న టీడీపీకి ఈ సమస్య పరిష్కారం సవాలేనని కేడర్ భావిస్తోందట. సుబ్బారెడ్డి బరి నుంచి తప్పుకొంటారా? అదే పరిస్థితి ఎదురైతే ఆయన ఎంత వరకు సహకరిస్తారు? ఒకవేళ సుబ్బారెడ్డే పోటీ చేస్తారని స్పష్టత ఇస్తే.. కేఈ కుటుంబం ఏం చేస్తుంది? అనే ప్రశ్నల చుట్టు ప్రస్తుతం డోన్ రాజకీయం తిరుగుతోంది.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!