Off The Record : శాసనమండలిలో BRS ఫ్లోర్ లీడర్స్ ఎవరు.. పోటీ పడుతున్న ఆ MLC లు ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసన మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరు? పోటీ పడుతున్న ఎమ్మెల్సీలు ఎవరెవరు? అధిష్టానం మనసులో ఉన్నదెవరు? కౌన్సిల్‌లో అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉందని కారు పార్టీ పెద్దలు భావిస్తున్నారు? దాంతో పాటు వాళ్ళు చెబుతున్న ఈక్వేషన్స్ ఏంటి?
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర నెలలవుతోంది. రెండు విడతల అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి. ప్రభుత్వం చీఫ్ విప్, విప్ లను ప్రకటించింది. ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్స్‌ని ప్రకటించాయి. శాసన మండలిలో కూడా రెండు పార్టీలు ఫ్లోర్ లీడర్స్‌ని ప్రకటించినా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మాత్రం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ పదవి కోసం ప్రస్తుతం పార్టీలో పోటీ గట్టిగానే ఉందని, అందుకే ఆలస్యం అవుతున్నట్టు తెలిసింది. తెలంగాణ శాసనమండలిలో బీఆర్‌ఎస్‌కు 28 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఇద్దరు.. పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పార్టీ మారిపోయారు. కౌన్సిల్ లో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో సూపర్ సీనియర్స్ ఉన్నా… ఫ్లోర్ లీడర్ పదవి తీసుకునేందుకు వారు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మిగతా వారిలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్సీలు పదవి కోసం పోటీ పడుతున్నారట. ప్రస్తుతం మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, ఎంఎస్ ప్రభాకర్‌రావు, భాను ప్రసాద్ రావు ఫ్లోర్ లీడర్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలంగాణ అసెంబ్లీ మొదటి శాసన సభాపతిగా పని చేశారు. సత్యవతి రాథోడ్ స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా పని చేశారు. భాను ప్రసాద్, ప్రభాకర్ రావు విప్ లుగా పని చేశారు.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
అందరికీ అనుభవం ఉన్నప్పటికీ… ప్రధాన ప్రతిపక్షం కౌన్సిల్ లో ప్రభుత్వానికి ధీటుగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ఫ్లోర్ లీడర్ పదవిని ఎవరికి ఇస్తారో అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఫ్లోర్ లీడర్ పదవి రేసులో ముందు ఉన్నారు. వీరిలో సత్యవతికే పదవి దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్ కూడా సత్యవతి రాథోడ్ వైపే మొగ్గుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సత్యవతికి ఇస్తే… కౌన్సిల్‌లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కూడా ఉంటుందన్నది పార్టీ పెద్దల అభిప్రాయంగా తెలిసింది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మహిళా కూడా కావడంతో పార్టీ శ్రేణులకు మంచి సంకేతాలు వెళ్తాయని అనుకుంటున్నారట. దీంతో మధుసూదనాచారి గట్టిగా ప్రయత్నిస్తున్నా… మొగ్గు సత్యవతికే ఉంటుందని అంటున్నారు. అధికారిక ప్రకటన రావడమే మిగిలిందని అంటున్నాయి పార్టీ వర్గాలు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!