Sid’s Dairy Farm: కల్తీ అనే మాట వినగానే మనకు వెంటనే పాలు గుర్తొస్తాయి. అంటే.. మనం నిత్యం వాడే పాలను ఏ స్థాయిలో కల్తీ చేస్తున్నారో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యంపై కాటు వేసే ఈ కల్తీ మహమ్మారిని మన దేశం నుంచి పారదోలాల్సిన అవసరం ఉందని కిషోర్ ఇందుకూరి అంటున్నారు.
Crude Oil Conspiracy: చమురు ధరలు మళ్లీ మండిపోనున్నాయి. ప్రస్తుతం 85 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ఆయిల్ రేటు త్వరలోనే వంద డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజు వారీ చమురు ఉత్పత్తిని తగ్గించనున్నట్లు సౌదీ అరేబియాతోపాటు ఒపెక్ ప్లస్ దేశాలు ప్రకటించటమే దీనికి కారణం. ఈ ప్రకటన కారణంగా ఒక్క రోజులోనే బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర 8 శాతం పెరిగింది.
Steve Jobs @ Apple: ఈ భూమ్మీద మనుషులు శాశ్వతం కాదు.. వాళ్లు సంపాదించిన పేరే చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ప్రపంచ ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే అలాంటి వ్యక్తుల్లో స్టీవ్ జాబ్స్ ఒకరు. వరల్డ్ వైడ్‌గా యాపిల్ పండు ఎంత పాపులరో యాపిల్ కంపెనీ ప్రొడక్టులు కూడా ఇప్పటికీ అంతే ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు కోఫౌండర్‌గా.. సీఈఓగా.. చైర్మన్‌గా ఈ విజయంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
Indian Stocks: 2022లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఇండియాకి గుడ్‌బై చెప్పేశారు. రూ.1.2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ను అమ్మేశారు. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కూడా ఇంత మంది ఫారన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌ను వీడలేదంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. పరాయి దేశాల పెట్టుబడిదారులు 2008లో దాదాపు 12 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్‌ను వదిలించుకోగా ఈసారి పదహారున్నర బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు.
IPL Cricket: ఐపీఎల్ అంటే అందరికీ తెలుసు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని. కానీ.. ఐపీఎల్‌ని ఇండియన్ ప్రాఫిటబుల్ లీగ్ అని సైతం అభివర్ణించొచ్చు. మన దేశంలోని అత్యంత విజయవంతమైన, అత్యధిక లాభదాయకమైన నవతరం స్టార్టప్‌లలో ఒకటిగా ఐపీఎల్ ఇప్పటికే తననుతాను నిరూపించుకుంది. బిజినెస్ విషయంలో.. విలువ పరంగా.. ఐపీఎల్.. యూనికార్న్ లెవల్ నుంచి డెకాకార్న్ స్థాయికి ఎదిగింది. ఈ క్రికెట్ లీగ్ వ్యాల్యూని డీ అండ్ పీ అడ్వైజరీ అనే కన్సల్టింగ్ సంస్థ వెల్లడించింది.
Gold Shine in 2023: బంగారం.. విలువైన లోహం. వన్నె కలిగిన వస్తువు. ఆభరణాల రూపంలో అలంకారం పరంగానే కాకుండా ఆర్థిక కోణంలో కూడా పసిడికి ప్రాధాన్యత ఎక్కువ. అందుకే.. ఎకానమీ అనగానే గోల్డ్ గురించిన ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వర్ణం పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు పరిశీలకులందరూ పాజిటివ్‌గానే సమాధానం ఇస్తుండటం విశేషం.
Subscribers Want Free Content On OTTs: మన దేశంలో ప్రేక్షకులు ఎంటర్టైన్‌మెంట్ కోసం వెండి తెర కన్నా బుల్లి తెర కన్నా ఓటీటీకే ఎక్కువ ఓటేస్తున్నారు. దీంతో గతేడాది కన్నా ఈ సంవత్సరం ఓటీటీ ఆడియెన్స్ సంఖ్య 20 శాతం పెరిగింది. ఇండియాలో ప్రస్తుతం ఓటీటీ వీక్షకుల సంఖ్య 42 పాయింట్ మూడు 8 కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని ‘‘ది ఆర్మాక్స్ ఓటీటీ ఆడియెన్స్ రిపోర్ట్’’ వెల్లడించింది. ఈ ఏడాదికి సంబంధించి జులై-సెప్టెంబర్ నివేదిక…
DHFL Loan Fraud Case: అప్పు చేసి పప్పు కూడు అనే మాట మనం విని ఉంటాం. కానీ.. కొంత మంది ఆ తప్పు కూడు తిని ఉన్నారు. DHFL లోన్ ఫ్రాడ్ కేసును దీనికి లేటెస్టు ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. DHFL.. అంటే.. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ సంస్థ యజమానులు లోన్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నారు. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకులతో…
Vikrant Varshney Exclusive Interview: జీవితంలో విజయం సాధించాలంటే కీలకమైన అంశాలపై దృష్టిపెట్టాలని సక్సీడ్ ఇండోవేషన్ కోఫౌండర్ అండ్ మేనేజింగ్ పార్ట్నర్ విక్రాంత్ వర్ష్నీ సూచించారు. ఎన్-బిజినెస్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. దీంతో తమ సక్సీడ్ వెంచర్స్ ఏవిధంగా సక్సెస్ సాధించిందో వివరించారు. అది ఆయన మాటల్లోనే.. కార్పొరేట్ ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీల్లో రెండు దశాబ్దాలపాటు పనిచేశాను. సొసైటీకి తిరిగివ్వాలనే లక్ష్యంతో బయటికి వచ్చాను.
Indian Celebrities Business World: మన దేశం.. సెలబ్రిటీలకు నిలయం. ఆ సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఎక్కువ. పాపులేషన్ ఎక్కువ కాబట్టి ప్రముఖులు కూడా ఎక్కువేనని, వాళ్లకు అభిమానులు అధికమని అనుకోవటానికి లేదు. ఎందుకంటే.. మనకు సహజంగానే సెలబ్రిటీలంటే ఇష్టం మరియు గౌరవం ఎక్కువ ఉండటం దీనికి కారణం. మన దేశంలో ముఖ్యంగా రెండు రంగాల్లో ప్రముఖుల ప్రభావం బాగా కనిపిస్తుంది. ఒకటి.. సినిమా. రెండు.. క్రికెట్. ఈ రెండు రంగాల్లో చాలా మంది రాత్రికిరాత్రే స్టార్లయిపోతారు.