Special Story on Walmart and Ikea: రిటైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు వాల్‌మార్ట్ మరియు ఐకియా. ఈ రెండు సంస్థలు ఇండియాలో మొండిగా ముందుకెళుతున్నాయి. భారీగా నష్టాలొస్తున్నా భరిస్తామంటున్నాయి. బిజినెస్‌ని కంటిన్యూ చేయాలనే నిర్ణయించుకున్నాయి. వాటి పట్టుదలకు తగ్గట్లే సేల్స్ పెరుగుతున్నాయి. కానీ.. లాభాల్లోకి రాలేకపోతున్నాయి. గతేడాది కాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవి అనుసరిస్తున్న వ్యాపార వ్యూహంపై మరిన్ని వివరాలు..
Special Story on SUVs Sales: వినాయకచవితి.. రక్షాబంధన్.. దసరా.. దీపావళి.. నవరాత్రి.. కార్తీక మాసం.. ఈ పండగ సీజన్‌లో ఎస్‌యూవీ కార్లు హాట్‌కేకుల్లా సేల్ అయ్యాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ మరియు మిడ్ సైజ్ వాహనాల విక్రయాలు జోరుగా సాగాయని వార్తలు వస్తున్నాయి. ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలకు సైతం భారీ గిరాకీ నెలకొందని డేటా వెల్లడిస్తోంది. అన్ని కార్ల కంపెనీలకు కూడా బిజినెస్ హ్యాపీగా జరిగినట్లు దీన్నిబట్టి తెలిసిపోతోంది.
Special Story on Netflix vs Disney: ప్రపంచవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ సెగ్మెంట్‌లో ఇప్పుడు రెండు ప్లాట్‌ఫామ్‌ల మధ్య నువ్వానేనా అనే రేంజ్‌లో పోటీ నెలకొంది. ఇందులో ఒకటి నెట్‌ఫ్లిక్స్ కాగా రెండోది డిస్నీ. ఈ రెండింటిలో నెట్‌ఫ్లిక్స్ చాలా సీనియర్. డిస్నీ బాగా జూనియర్. అయితే.. మార్కెట్‌లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమని డిస్నీ అంటుంటే.. నెట్‌ఫ్లిక్స్ మాత్రం తన ఫ్యూచర్ ప్లాన్లు తనకు ఉన్నాయని ధీమాగా చెబుతోంది. ఇంతకీ…
Satya Nadella: ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. దానికి తెలుగు సీఈఓ అయిన సత్య నాదెళ్ల లేటెస్టుగా సంస్థ ఉద్యోగులను, ఇన్వెస్టర్లను, కస్టమర్లను, పార్ట్నర్లను ఉద్దేశించి ఒక లెటర్ రాశారు. మైక్రోసాఫ్ట్ యాన్యువల్ రిపోర్ట్-2022లో పబ్లిష్ అయిన ఆ లేఖలో సత్య నాదెళ్ల పేర్కొన్న ఓ విషయం ఆసక్తికరంగా ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఏకైక పరిష్కారం డిజిటల్ టెక్నాలజీయే అని సత్య నాదెళ్ల చెప్పారు.
Special Story on India’s Natural Gas Needs: రోజురోజుకీ పెరుగుతున్న సహజ వాయువు ధరలను మోయలేక యూరప్ దేశాల వెన్ను విరుగుతోంది. అలాగే.. ఈమధ్య కాలంలో రష్యా నుంచి దిగుమతులు తగ్గటంతో ఇండియా కూడా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్‌ను అధిక రేట్లకు కొనాల్సి వచ్చింది. ఈ సమస్యకు మన దగ్గర రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి.. తక్కువ రేటుకి గ్యాస్ దొరికేలా చూసుకోవటం; రెండు.. దేశీయంగా ఉత్పత్తిని పెంచటం. కానీ.. ఈ రెండూ అనుకున్నంత…
Special Story on Indian Digital Currency: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించారు. అంతకుముందు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ‘‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ’’పై కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఈ కొత్త డిజిటల్ కరెన్సీ ఆసక్తికరమైన చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Special Story on Shiv Nadar: దానం.. మనిషికి ఉండాల్సిన ఓ మంచి లక్షణం. కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ ఆయన రెండు చేతులా చేస్తుంటారు. రోజుకి 3 కోట్ల రూపాయలు సమాజానికిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. సంపదను పంచిపెట్టడంలో తనకుతానే సాటని నిరూపించుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు నంబర్-1గా నిలిచారు. మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.
Why People Lose Money in Stock Markets?: జనం స్టాక్ మార్కెట్లలో డబ్బులను పోగొట్టుకుంటూ ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది.. అవగాహన లోపం. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అంటే అదీ ఒక సీరియస్ బిజినెస్ అనే చెప్పాలి. ఎవరైనా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ముందు దాని గురించి లోతుగా స్టడీ చేస్తారు. లాభనష్టాలను తెలుసుకుంటారు. అన్నింటిపైనా అవగాహన వచ్చాకే ఇన్వెస్ట్ చేస్తారు. దానిపైన లాభాలు వచ్చేవరకు ఓపిక పడతారు. కానీ స్టాక్…