Sid’s Dairy Farm: కల్తీ అనే మాట వినగానే మనకు వెంటనే పాలు గుర్తొస్తాయి. అంటే.. మనం నిత్యం వాడే పాలను ఏ స్థాయిలో కల్తీ చేస్తున్నారో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యంపై కాటు వేసే ఈ కల్తీ మహమ్మారిని మన దేశం నుంచి పారదోలాల్సిన అవసరం ఉందని కిషోర్ ఇందుకూరి అంటున్నారు.
ఈ మేరకు ఆయన తన పెద్ద కొడుకు సిద్దార్థ పేరుతో ‘‘సిద్స్ డైరీ ఫామ్’’ను ఏర్పాటుచేశారు. వినియోగదారులకు వంద శాతం స్వచ్ఛమైన పాలను అందించేందుకు ఏకంగా 45 పరీక్షలు నిర్వహిస్తున్నారు. తద్వారా అచ్చమైన, ఆరోగ్యకరమైన డైరీ ప్రొడక్టులను మార్కెట్‌లోకి తెస్తున్నారు.
కెరీర్ కోసం విదేశాలకు వెళ్లినప్పటికీ స్వదేశానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతో ఈవిధంగా ముందుకెళుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎన్టీవీ బిజినెస్ ఛానల్.. కిషోర్ ఇందుకూరితో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వీడియో మీ కోసం..