World Bank About India: వచ్చే ఏడాది.. ఇండియా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో.. పాపులేషన్‌కి తగ్గట్లే ప్రాథమిక సౌకర్యాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు వచ్చే 15 ఏళ్లలో.. ముఖ్యంగా.. నగరాలకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలి?, ప్రస్తుతం ఎంత లోటు బడ్జెట్ నెలకొంది? సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుల్లో దేని వాటా ఎంత అనే విషయాలను వివరిస్తూ ప్రపంచ…
Real India: పెరుగుతున్న వడ్డీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం వల్ల కొంత మందగమనం నెలకొన్నప్పటికీ.. ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో మంచి పనితీరే కనబరిచిందని.. కొలియర్స్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు.. అంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో.. మన దేశ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు.. గతేడాదితో పోల్చితే 18 శాతం పెరిగి.. 3 పాయింట్ 6 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపింది.
The India Box Office Report-October: అక్టోబర్‌కు సంబంధించిన ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ నెలలో దేశం మొత్తమ్మీద ఏ భాషలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? వాటికి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? అన్నింటికన్నా ఏ మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది? తదితర విషయాలను ఈ నివేదిక ప్రేక్షక దేవుళ్లకు సమగ్రంగా సమర్పిస్తోంది.
IT Companies Lay offs: ఆర్థిక సంక్షోభ భయాలతో ఉద్యోగులను ఇంటికి పరిమితం చేస్తున్న కార్పొరేట్ కంపెనీల జాబితాలోకి ఇప్పుడు సిస్కో కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. నెట్ వర్కింగ్ రంగంలో పెద్ద సంస్థగా పేరొందిన సిస్కో.. 4 వేలకు పైగా కొలువులకు లేదా మొత్తం వర్క్ ఫోర్సులో 5 శాతానికి కోత పెట్టనుందని అంటున్నారు. అయితే.. ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం ఈ వార్తల్ని ధ్రువీకరించట్లేదు. అలాగని.. పూర్తిగా తోసిపుచ్చటం కూడా చేయలేదు.
Special Story on Snapdeal Founders: మన దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్ ప్లేసుల్లో ఒకటైన స్నాప్‌డీల్ సక్సెస్ స్టోరీ వెనక ఇద్దరు మిత్రులున్నారు. వాళ్లే.. కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్. స్నాప్‌డీల్ విజయవంతం కావటంతో వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా యూనికార్న్‌లు మరియు సూనికార్న్‌ల్లో వ్యక్తిగతంగా భారీఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అవి అనూహ్యంగా లాభాలను ఆర్జిస్తుండటంతో ఇద్దరి సంపద దాదాపు 200 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
Special Story on Nykaa’s Business Model: నైకా అనే ఇ-కామర్స్ కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంస్థ రెండేళ్ల కిందట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళ సారథ్యం వహిస్తున్న ఫస్ట్ ఇండియన్ యూనికార్న్ స్టార్టప్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్ల కిందట ప్రారంభమైన ఈ పాపులర్ ఆన్‌లైన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రిటైలర్.. ఏడాది క్రితం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి వచ్చింది. తద్వారా 5 వేల 352 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది.…
Special Story on Marriages: దేశవ్యాప్తంగా వ్యాపారులకు ఈ ఏడాది దీపావళి పండుగ ఘనంగా గుర్తుండిపోతుంది. ఫెస్టివల్ సీజన్‌లో బిజినెస్ బాగా జరగటంతో వాళ్లు మస్తు ఖుషీ అయ్యారు. మళ్లీ అదే రేంజ్‌లో వ్యాపారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14 వరకు భారీ సంఖ్యలో బాజాలు మోగనుండటంతో బిజినెస్ సైతం పెద్దఎత్తున జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం ఎన్ని మ్యారేజ్‌లు జరగనున్నాయి? వాటికి…
Special Story on Use of cash: ‘ఫీల్ మై క్యాష్’ అనే కాన్సెప్ట్ గురించి ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఆరేళ్లయినా.. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా.. జనం ఇప్పటికీ రికార్డు లెవల్లో క్యాషే వాడుతున్నారు. కారణమేంటంటే ‘పర్సనల్’ అంటున్నారు. ఆర్య సినిమాలోని ‘ఫీల్ మై లవ్’ అనే పాట మాదిరిగా ‘ఫీల్ మై క్యాష్’ అని చెబుతున్నారు. డబ్బు.. బ్యాంక్ ఖాతాలో ఉండటం వేరు, చేతిలో ఉండటం వేరు అని…
Special Story on Sundar Pichai: ఈ రోజుల్లో చాలా మంది తమకు తెలియని ఏ విషయాన్నైనా అడిగేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ముందుగా గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారు. ఆ తల్లినే కన్న కొడుకు సుందర్ పిచాయ్. ప్రపంచంలోని పవర్ ఫుల్ కంపెనీ గూగుల్‌కి సీఈఓ అయిన మొట్టమొదటి నల్లజాతీయుడు, భారతీయుడు ఈయనే కావటం మనకు గర్వకారణం. సెర్చింజన్లలో గూగుల్ ఒక దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్‌బార్ రూపకల్పనలో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించారు.
END of Ola and Uber?: హమ్మయ్య.. నగరాల్లో నరకం చూపే ఆటోవాళ్ల ఆగడాలను అరికట్టడానికి ఓలా, ఉబర్ వచ్చాయని జనం సంబరపడ్డారు. ప్రయాణం ఇంత సునాయాసమా అని సంతోషం వ్యక్తం చేశారు. ఇంటికే వచ్చి పికప్ చేసుకోవటం, సరిగ్గా ఎక్కడికి వెళ్లాలో అక్కడే డ్రాప్ చేయటం, ఛార్జీ బేరమాడే అవసరం లేకపోవటం, ఏసీ, ఎంటర్టైన్మెంట్ మరియు ఇతరత్రా సదుపాయాలు సైతం ఉండటంతో ప్యాసింజర్లు ఫుల్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ.. ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటేనని ఆ…