రేపు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించే అవకాశం ఉంది. కాగా.. ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్స్, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. రేపు అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరిగింది. కాగా.. ఈ విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. అయితే.. వాసుపల్లి గణేష్ స్పీకర్ సీతారాంను ఒక్క నిమిషం మాత్రమే కలిసి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై పోటీ చేసి గెలిచాను.. తర్వాత టీడీపీ పేద వాళ్ళకు అన్యాయం చేస్తోందని గమనించి పార్టీకి దూరం జరిగానని తెలిపారు. తాను…
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ చీఫ్ విప్ తమ పై ఫిర్యాదు చేశారని స్పీకర్ చెప్పారన్నారు. కంప్లైంట్ ఇచ్చిన చీఫ్ విప్ ప్రసాద్ రాజు…