గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఇచ్చారు. దీనికి ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఏటా రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా హై టీకి ఆతిథ్యం ఇస్తుంటారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. విజయవాడలోని రాజ్ భవన్ లో వేడుక కనుల పండువగా జరిగింది. ఈ తేనీటి విందుకి హైకోర్టు సీజే పీకే మిశ్రా దంపతులు, పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు హాజరయ్యారు. ఎట్ హోం విందుకు హాజరయ్యారు ఏస్ షట్లర్ పీవీ సింధు. దీంతో అక్కడ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా హాజరయ్యారు.
Read Also: Siddharth: హీరోయిన్ తో ఎఫైర్ బట్టబయలే.. కానీ, పెళ్ళికి ముందే మరీ ఇంతలానా
ఇదిలా ఉంటే ఏపీలో ఎట్ హోం కార్యక్రమానికి పలువురు హాజరుకాలేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే సందర్భంగా ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఆహ్వానించిన ఏపీ గవర్నరుకు ధన్యవాదాలు.రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు.రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్-1 తీసుకొచ్చి ప్రజాస్వామిక హక్కులను కాలరాసింది.జీవో నెంబర్ 1 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం అన్నారు.
Read Also: Pullareddy Sweets : పుల్లారెడ్డి స్వీట్స్‌కు జీహెచ్‌ఎంసీ జరిమానా