ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. పొరుగు రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరుగుతున్న అన్యాయం వివరిస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. అసలు ఎందుకు సస్పెండ్ చేశారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది.సభ నుంచి సస్పెండ్ చేయగలరేమో కానీ ప్రశ్నించే గొంతును సస్పెండ్ చేయలేరు. కర్ణాటక నిర్మించే అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం ప్రశ్నించలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఎగువన నిర్మించే అక్రమ ప్రాజెక్టులు వల్ల ఎంత నష్టమో వివరించానన్నారు.
Read Also: Harish rao : కాంగ్రెస్- బీజేపీవి సొల్లు మాటలు!
తెలంగాణా, కర్ణాటకల్లో ఉన్న తమ ఆస్తులు కాపాడుకునేందుకే, ప్రభుత్వ పెద్దలు రాయలసీమను నాశనం చేసే అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపడం లేదు.మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం భయపడి సస్పెండ్ చేసింది.అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే కర్నూలు, అనంతపురం జిల్లాలు ఎం కావాలి..?రాయలసీమ జిల్లాల భూములు శాశ్వతంగా బీడు మారే ప్రమాదాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు.గవర్నర్ చేత ప్రభుత్వం చెప్పించిన అసత్యాలని మాత్రమే మేం ఎత్తి చూపాం. మాజీ గవర్నర్లు, మండలి ఛైర్మన్ షరీఫులను ఘోరంగా అవమానించిన వైసీపీ నేతలా మాకు నీతులు చెప్పేది.మంత్రి చెప్పే బుర్రకథలు వినేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు.
టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నా సీట్లో నుంచి కదలని నన్ను సస్పెండ్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సింహం సింగిల్ గా వస్తుందని చెప్పుకునే వారు మా సభ్యులకు సమాధానం చెప్పలేక సస్పెన్షన్ మార్గం ఎంచుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం చెప్పించిన అసత్యాలు అసెంబ్లీలో ఆధారాలతో సహా ఎండగడతామనే మమ్మల్ని సస్పెండ్ చేశారు.రానున్న రోజుల్లో అసెంబ్లీలో మళ్లీ అడుగు పెట్టలేని విధంగా జగనుకి బుద్ధి చెప్తాం అన్నారు రామానాయుడు.
Read Also: KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు