అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలపై మంత్రులు మండిపడ్డారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని, కులాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని, ఒకరి భుజం మీద తుపాకీ పెట్టి మరొకరిని కాల్చడం చంద్రబాబు నైజమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాజ్యాంగ మీద ప్రమాణం చేసి మరీ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి ఏడ్చి వెళ్లిపోయి.. బయట ఉండి అమాయకుడైన టీడీపీ దళిత శాసనసభ్యుడిని అడ్డంపెట్టి స్పీకర్‌పైనే దాడికి పురిగొల్పాడని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, వైయస్‌ఆర్ సీపీ దళిత శాసనసభ్యుడు సుధాకర్‌బాబుపై శాసనసభలో టీడీపీ సభ్యులు చేసిన దాడిని మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు.
Read Also: Marriage : పెళ్లికెందుకు రాలేదన్నందుకు ‘చావు’ దెబ్బలు కొట్టిన పెళ్లాం
మరోవైపు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ సభ్యుల తీరు ఉంది. స్పీకర్ ఛైర్ ను గౌరవించాల్సిన బాధ్యత అందరి పై ఉంది. డోలా వీరాంజనేయ స్వామి గడిచిన వారం రోజులుగా సభాపతి కుర్చీని నెట్టడం, ప్లకార్డులు పెట్టడం చేస్తూనే ఉన్నారు. దళిత సభ్యులు, ఉప ముఖ్యమంత్రి పై దాడి చేయటం, దుర్భాషలాడటం చేస్తూనే ఉన్నారు. కాగితాలు చింపి సభాపతి పై వేయటం టీడీపీ ఎమ్మెల్యేలకు అలవాటుగా మారింది. వాళ్ళే దాడి చేస్తారు…వాళ్ళే భోరున ఏడుస్తారు. బీసీలంటే చంద్రబాబుకు చిన్న చూపు ఉందన్నారు వేణుగోపాల్. బీసీ నాయకుడు తమ్మినేని స్పీకర్ గా ఎన్నిక అయినప్పుడు కూడా కుర్చీ వరకు తీసుకుని వెళ్ళటానికి చంద్రబాబు రాలేదు. స్పీకర్ పట్ల గౌరవాన్ని చూపించటానికి చంద్రబాబుకు మనసు రాలేదు. దెబ్బతిన్నది మా సభ్యుడు సుధాకర్ బాబు అన్నారు మంత్రి వేణుగోపాల్.
Read Also: LB Nagar Flyover: తీరనున్న ఎల్బీ నగర్ వాసుల ట్రాఫిక్ కష్టాలు